https://oktelugu.com/

Delhi Metro: ఢిల్లీ మెట్రోలో మళ్లీ ముద్దులాట.. మీరు ఇక మారరా?

తాజాగా ఢిల్లీ మెట్రోలో జంట మెట్రో కోచ్‌లో కౌగిలింతలు, ముద్దులతో రెచ్చిపోయింది. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి.

Written By:
  • Raj Shekar
  • , Updated On : March 4, 2024 / 11:15 AM IST

    Delhi metro viral video

    Follow us on

    Delhi Metro: ఢిల్లీ మెట్రో యువ జంటల రాసలీలలకు కేరాఫ్‌గా మారింది. అధికారులు ఎన్నిసార్లు హెచ్చరించినా వారి బుద్ధి మారడం లేదు. నిత్యం లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేరుస్తున్న ఢిల్లీ మెట్రోలో ఇప్పటికే ఎన్నో ప్రేమజంటల శృంగార చేష్టలు వెలుగు చూశాయి. తోటి ప్రయాణికులు అభ్యంతరం చెబుతున్నా లెక్క చేయడం లేదు. అందరి ముందే వెకిలి చేష్టలు చేస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఇటీవల గట్టి హెచ్చరికలు జారీ చేశారు. దీంతో కొన్నిరోజులుగా ఆగినట్లే అనిపించింది.

    తాజాగా మరో జంట ముద్దులు..
    తాజాగా ఢిల్లీ మెట్రోలో జంట మెట్రో కోచ్‌లో కౌగిలింతలు, ముద్దులతో రెచ్చిపోయింది. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి. ప్రయాణికుల్లో కొందరు ఇలాంటి దృశ్యాలను వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెడుతున్నా వారిలో మార్పు రావడం లేదు. తాజా వీడియోపై నెటిజన్లు, ప్రయాణికులు మండిపడుతున్నారు. ప్రయాణికులు ఇలాంటి కార్యకలాపాలకు పాల్పొడొద్దని మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ పదే పదే హెచ్చరిస్తోంది. అయినా వారి బుద్ధి మారడం లేదు.

    కేసులు పెట్టాలని డిమాండ్‌..
    ఎన్నిసార్లు వార్నింగ్‌ ఇచ్చిన మెట్రోలో రాసలీలలు ఆగడం లేదు. దీంతో ప్రయాణికులు, నెటిజన్లు ఇలాంటి చర్యలకు పాల్పడేవారిపై కేసులు పెట్టాలని కోరుతున్నారు. కఠిన చర్యలు, కేసులు నమోదు చేయడం వంటివి లేకపోవడంతో ప్రేమజంటలు ఇలా రెచ్చిపోతున్నాయంటున్నారు. దీనిపై ఢిల్లీ మెట్రో కారొపరేషన్‌ ఆలోచన చేయాలని కోరుతున్నారు. మరి చూడాలి కఠిన చర్యలు ఉంటాయో లేదో.