Aadhaar Card: ఆధార్ కార్డ్ ఎంత ముఖ్యమైన కార్డ్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఎవరైతే జీఎస్టీ చెల్లిస్తారో వాళ్లు ఆధార్ కార్డును తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని చెప్పారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ ఈ విషయాన్ని వెల్లడించడం గమనార్హం. జీఎస్టీ నిబంధనలను సంబంధించి ఈ మేరకు మార్పులు చేయబడ్డాయని తెలుస్తోంది.

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ జీఎస్టీ రిఫండ్ డబ్బులను ఇకపై నేరుగా బ్యాంకు ఖాతాకే డిపాజిట్ చేయనుంది. కేంద్ర ప్రభుత్వం పన్ను ఎగవేత చర్యలకు చెక్ పెట్టాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. వ్యాపారులు ఏదైనా కారణం చేత ఆధార్ కార్డును ఇవ్వకపోయినా ఫిజికల్ వెరిఫికేషన్ తర్వాత మాత్రమే జీఎస్టీ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. జీఎస్టీ రిఫండ్ డబ్బులను కేంద్రం పాన్ కార్డ్ లింక్ అయిన బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేయనుంది.
జీఎస్టీ రిఫండ్ ను పొందాలని భావించే వ్యాపారులు ఖచ్చితంగా బయోమెట్రిక్ ఆధార్ తో జీఎస్టీ రిజిస్ట్రేషన్ ను ఖచ్చితంగా లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చేయని పక్షంలో జీఎస్టీ రిఫండ్ డబ్బులను పొందడం సాధ్యం కాదు. అయితే వచ్చే ఏడాది జనవరి నెల 1వ తేదీ నుంచి ఈ నిబంధనలు అమలులోకి రానున్నాయని సమాచారం. మంత్లీ జీఎస్టీ చెల్లించని వాళ్లు, రిటర్న్ దాఖలు చేయడంలో విఫలమైన వాళ్లు జీఎస్‌టీఆర్ 1ను దాఖలు చేయడం సాధ్యం కాదు.
జీఎస్టీని చెల్లించే వాళ్లు తప్పనిసరిగా ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. ఈ నిబంధనలను గుర్తుంచుకోకపోతే మాత్రం నష్టపోయే అవకాశం ఉంటుంది. ఆధార్ కార్డు లేని వాళ్లు భారీగా బయోమెట్రిక్ వేయించుకోని పక్షంలో భారీగా నష్టపోయే అవకాశం ఉంటుంది.