https://oktelugu.com/

Hyderabad : సిటీ నేచర్ ఛాలెంజ్ లో దేశంలోనే హైదరాబాద్ నే నెంబర్ వన్

ప్రకృతితో వ్యక్తుల అనుబంధాన్ని పెంచుకోవాలని, దీర్ఘకాలికంగా పౌర విజ్ఒాన ప్రాజెక్టులలోకి వారిని ఆకర్షించాలని కోరుతున్నట్లు ఫరీదా పేర్కొన్నారు. 

Written By:
  • Srinivas
  • , Updated On : May 11, 2023 / 12:03 PM IST
    Follow us on

    Hyderabad : హైదరాబాద్ కు మరో గౌరవం దక్కింది. ఇప్పటికే దేశంలో నివాస యోగ్య నగరంలో మన సిటీకి రెండో స్థానం వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మహానగంలో ప్రకృతి పులకరింపజేసే నగరంగా హైదరాబాద్ ను చేర్చారు. జీవవైవిద్య పరిరక్షణలో ప్రపంచ ప్రయత్యామ్నాయానికి మాత్రమే కాకుండా ప్రకృతితో లోతైన సంబంధాన్ని పెంపొందించడానికి హైదరాబాద్ తోడ్పడిందని పర్యావరణ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ప్రకృతిపై అవగాహన పెంచుకోవడానికి, గ్లోబల్ అర్బన్ బయోడైవర్సిటీ డేటా సేకరించే భాగంలో ఓ బృందం డాక్యుమెంటరీ రూపొందించింది. ఇందులో భాగంగా దేశంలోని కొన్ని నగరాలను ప్రామాణికంగా తీసుకోగా ఇందులో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలవడం విశేషం.

    సిటీనేచర్ చాలెంజ్ గా నిర్వహించిన ఈ కార్యక్రమంలో దేశంలోని 35 నగరాలు పోటీ పడ్డాయి. అయితే హైదరాబాద్ మహానగరంలో పర్యావరణ పరిరక్షణను కాపాడడానికి తీసుకునే చర్యలతో ఇది మొదటి స్థానంలో నిలిచింది. ఫరీదా, అక్బర్, రామ్, ప్రియాంక నేతృత్వంలోని WWFకు చెందిన ఓ బృందం ఓ డాక్యుమెంటరీ రూపొందించింది. ఈ చాలెంజ్ లో హైదరాబాద్ నుంచి రామ్ దయాళ్ వైష్ణవ్ పాల్గొని మాట్లాడారు. ప్రకృతిపై మనం అవగాహన పెంపొందించుకోవడం కోసం గ్లోబల్ అర్బన్ బయో డై వర్సిటీ డేటా సేకరణకు ఇది మంచి అవకాశం అని అన్నారు.

    ఏప్రిల్ 28 నుంచి మే 1 వరకు నాలుగు రోజుల పాటు హైదరాబాద్ సిటీ నేచర్ ఛాలెంజ్ లో 377 మంది శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఇందులో 1900 జాతులకు చెందిన 30 వేల మొక్కలను పరిశీలించారు. పట్టణ జీవన వైవిద్యాన్ని డాక్యమెంటేషన్ చేయడానికి ఉద్దేశించిన ప్రపంచ పోటీల్లో అన్ని నగరాల నుంచి మంచి స్పందన వచ్చినట్లు శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. హైదరాబాద్ నుంచి రెడ్ -వెంటేడ్ బల్పుల్, ప్లెయిన్ టైగర్ సీతాకొకచిలుక, కామన్ లాంటానా, పవిత్రమైన ఫిగ్, శాంతా మారియా ఫ్యూ వంటి తరుచుగా కనిపించే 33 జాతుల ఆవిష్కరణలను ప్రదర్శించారు.

    హైదరాబాద్ ప్రదర్శనకు ఆకర్షితులైన శాస్త్రవేత్తలు ప్రశంసలు కురిపించారు. WWF ఇండియా హైదరాబాద్ ఆపీస్ స్టేట్ డైరెక్టర్ ఫరీదా తంపాల్ మాట్లాడుతూ గ్లోబర్ స్కేల్ లో హైదరాబాద్ అసాధరణ ప్రదర్శనకు మేం సంతోషిస్తున్నామని తెలిపారు. ప్రకృతితో వ్యక్తుల అనుబంధాన్ని పెంచుకోవాలని, దీర్ఘకాలికంగా పౌర విజ్ఒాన ప్రాజెక్టులలోకి వారిని ఆకర్షించాలని కోరుతున్నట్లు ఫరీదా పేర్కొన్నారు.