Upasana Konidela : మెగా కోడలు, కామినేని ఇంటి ఆడపడుచు ‘ఉపాసన’ది చాలా పెద్ద ఫ్రొఫైల్ ఉంది. వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతిగా ఉన్న ఉపాసన, తెలంగాణా రాష్ట్రంలోని దోమకొండ సంస్థానం వారసురాలు. గోల్డెన్ స్పూన్ తో పుట్టినప్పటికీ ఉపాసన లైఫ్ ని ఛాలెంజింగ్ గా మలచుకున్నారు. ఆమె అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టారు. బి పాజిటివ్ హెల్త్ అండ్ ఫ్యాషన్ మ్యాగజైన్ స్థాపించి సక్సెస్ ఫుల్ గా నడుపుతున్నారు. అయితే, రామ్‌చరణ్ తో ఉపాసన పెళ్లి అయ్యి ఇప్పటికీ పదేళ్లు అవుతుంది. కానీ ఇప్పటికీ వీరికి సంతానం లేదు.
ఈ విషయం పై సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు చర్చ సాగుతూనే ఉంటుంది. ఉపాసనకు సైతం తరచూ ఈ ప్రశ్న ఎదురవుతూనే ఉంటుంది. కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా ఇదే విషయం గురించి పదే పదే అడగడంతో ఉపాసన విసిగిపోయింది. అందుకే.. ఆమె తాజాగా ఆధ్యాత్మిక గురువు సద్గురు దగ్గర పిల్లలను కనడం అనే కాన్సెప్ట్ గురించి క్లారిటీగా అడిగింది.
Upasana
మెగా కోడలు ఉపాసన మాట్లాడుతూ.. ‘చరణ్ తో నా పెళ్లి జరిగి పదేళ్లు అవుతోంది. పర్సనల్ గా మా వైవాహిక జీవితం చాలా చాలా సంతోషంగా ఉంది. నా ఫ్యామిలీని, నా జీవితాన్ని నేను చాలా ప్రేమిస్తున్నాను. అయితే, ప్రజలు మాత్రం నా జీవితంలోని ఆర్‌ఆర్‌ఆర్ గురించి ఎక్కువగా చర్చిస్తున్నారు. ఫస్ట్ ఆర్.. నా రిలేషన్‌షిప్ గురించి, సెకండ్ ఆర్.. రీ ప్రొడ్యూస్ (పిల్లలను కనే సామర్థ్యం గురించి), మూడో ఆర్.. లైఫ్ లో నా రోల్.. ప్రస్తుతం జనాలందరూ వీటి గురించే ఎక్కువ మాట్లాడుతున్నారు’ అంటూ ఉపాసన తెలియజేసింది.
ఉపాసన అడిగిన ప్రశ్నకు సద్గురు కూడా ఇంట్రెస్టింగ్ గా సమాధానం ఇచ్చారు. సద్గురు మాటల్లో ‘మానవ జీవితంలో రిలేషన్ అనేది ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత విషయం. అందుకే.. మరో వ్యక్తి ఆ రిలేషన్ లో తలదూర్చక పోవడం మంచిది. రెండోది రీప్రొడ్యూస్.. ఏ అమ్మాయిలు అయితే పిల్లలను కనకుండా ఉంటారో నేను వారందరికీ అవార్డులు ఇస్తాను. నేటి తరం ఆడవాళ్లు పిల్లలను కనాల్సిన అవసరం లేదు అనేది నా భావన. ఇప్పటికే మన ప్రపంచ జనాభా ఎక్కువ అయిపోయింది. ఒకవేళ నువ్వు ఆడపులివి అయి ఉంటే మాత్రం.. కచ్చితంగా పిల్లల్ని కను అని సలహా ఇచ్చేవాడిని. ఎందుకంటే ప్రస్తుతం పులులు అంతరించిపోతున్నాయి కదా. కానీ మనుషులం అంతరించడం లేదు. పైగా చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నాం’ అని సద్గురు చెప్పుకొచ్చారు.
సద్గురు సమాధానం విన్న ఉపాసన నవ్వుతూ.. ‘మీరు ఈ విధంగా చెప్పారు కదా! ఇక మీకు మా అమ్మ, అత్తయ్యగారి నుంచి వరుసగా ఫోన్ కాల్స్ వస్తూనే ఉంటాయి’ అని ఉపాసన సరదాగా కామెంట్స్ చేసింది. ఉపాసన మాటకు సద్గురు కూడా సరదాగా రియాక్ట్ అవుతూ.. ‘అలాంటి అమ్మలు, అత్తల నుంచి నాకు చాలా ఫోన్లు వస్తుంటాయ్’ అని బిగ్గరగా నవ్వేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.