Sudigali Sudheer Goat movie: ఈటీవీ లో జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా ఒక కమెడియన్ గా కెరీర్ ని ప్రారంభించి, తన స్వభావం తో, అద్భుతమైన కామెడీ టైమింగ్ తో కోట్లాది మంది తెలుగు ప్రజల మనసుల్ని గెలుచుకున్న టాలెంటెడ్ నటుడు సుడిగాలి సుధీర్(Sudigali Sudheer). ఈ షో తర్వాత సుధీర్ రేంజ్ ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్ళింది. ఒకప్పుడు ఈటీవీ లో సుడిగాలి సుధీర్ లేని ఎంటర్టైన్మెంట్ షో ఉండేది కాదు. అంత బిజీ ఆర్టిస్టుగా మారిపోయాడు. ఆ తర్వాత మెల్లగా సినిమా అవకాశాలు రావడం మొదలయ్యాయి. మొదట్లో కమెడియన్ పాత్రలే వచ్చాయి. ఆ తర్వాత హీరో పాత్రలు కూడా మెల్లగా రావడం మొదలయ్యాయి. మొదటి సినిమా యావరేజ్ గా ఆడింది. రెండవ సినిమా ఫ్లాప్ అయినా, మూడవ చిత్రం ‘గాలోడు’ మాత్రం కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది.
Read Also: ప్రీమియర్ షో ల వల్లనే సినిమాలకు కలెక్షన్స్ తగ్గుతున్నాయా..? అసలేం జరుగుతోంది..?
ఆ తర్వాత విడుదలైన ‘ఆపరేషన్ సహస్త్ర’ అనే చిత్రం పెద్ద ఫ్లాప్ అయ్యింది. అంతే ఆ సినిమా తర్వాత మళ్ళీ సుధీర్ సినిమాల్లో కనిపించలేదు. కానీ ‘గోట్’ అనే చిత్రాన్ని మొదలు పెట్టాడు. గోట్ అంటే ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం'(The Greatest Of All Time) అన్నమాట. తమిళ హీరో విజయ్ ఈ టైటిల్ తో గత ఏడాది ఒక సినిమా చేసాడు. కానీ విజయ్ కంటే ముందే ఈ టైటిల్ సుడిగాలి సుధీర్ సినిమాకు ఫిక్స్ అయ్యింది. విజయ్ సినిమా విడుదలై, థియేటర్స్ బాగా రన్ అయ్యి వెళ్ళిపోయింది కూడా, కానీ సుధీర్ ‘గోట్’ మాత్రం ఎటు పోయిందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఈ చిత్రం లోని ‘అయ్యో పాపం సారూ’ అనే పాట పెద్ద హిట్ అయ్యింది. గత ఏడాది ఫిబ్రవరి నెలలో విడుదలైన ఈ పాటకు యూట్యూబ్ లో 10 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. పర్వాలేదు సుధీర్ సినిమా ఈసారి మంచి క్వాలిటీ తో వస్తుంది. గట్టిగా హిట్ కొట్టేలా ఉన్నాడు అని ఆయన అభిమానులు అనుకున్నారు.
Read Also: కింగ్డమ్ మూవీ ఓవర్సీస్ రివ్యూ వచ్చేసింది..సినిమా పరిస్థితి ఏంటంటే?
కానీ ఇప్పటి వరకు ఈ సినిమా షూటింగ్ స్టేటస్ ఏంటో తెలియదు. అందుతున్న విశ్వసనీయ వర్గాల ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఆగిపోయి చాలా కాలం అయ్యిందట. డైరెక్టర్ మారిపోవడం తో సుధీర్ కూడా ఈ చిత్రం నుండి తప్పుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం డైరెక్టర్ ని చూసి మాత్రమే ఈ సినిమాని నేను ఒప్పుకున్నానని, వేరే వాళ్ళు అయితే ఈ సినిమా చెయ్యనని సుధీర్ అన్నట్టు భోగట్టా. కానీ అందుకు ఎలాంటి ఆధారాలు లేవు, సోషల్ మీడియా లో వినిపిస్తున్న బలమైన వార్త ఏమిటంటే సుధీర్ ని కావాలని తొక్కే ప్రయత్నం చేస్తున్నారని. నిర్మాతకు ఉద్దేశపూర్వకంగానే ఫైనాన్స్ కట్ చేయడం వల్ల ఈ సినిమా ఆగిపోయిందని అంటున్నారు. ప్రస్తుతం సుధీర్ ఈటీవీ లో ఫ్యామిలీ స్టార్స్, జీ తెలుగు లో సూపర్ ఛాంపియన్స్ వంటి షోస్ కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు.