Vikram Closing Collections
Vikram Closing Collections: దశావతారం సినిమా తర్వాత సుమారు పదేళ్ల పాటు సరైన సక్సెస్ లేక తీవ్రమైన ఇబ్బంది పడుతున్న కమల్ హాసన్ కి ఇటీవలే విడుదలైన విక్రమ్ సినిమా ఏ స్థాయి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..#RRR మరియు KGF చాప్టర్ 2 వంటి సినిమాలు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం నుండి ప్రేక్షకులు ఇంకా తేరుకోకముందే విడుదలైన విక్రమ్ సినిమా..ఆ రెండు సినిమాల తరహాలోనే బాక్స్ ఆఫీస్ వద్ద విస్ఫోటనం ని సృష్టించింది..అద్భుతమైన ట్రైలర్ మరియు పాటలతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పాటు చేసిన ఈ సినిమా..ఆ అంచనాలను అందుకోవడం లో మొదటి రోజు మొదటి ఆట నుండే సక్సెస్ అయ్యింది..టాక్ అద్భుతంగా రావడం తో ఓపెనింగ్స్ అదిరిపోయాయి..ఇక లాంగ్ రన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..నాల్గవ వారం లో కూడా చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ పడ్డాయి..ఇప్పటికి విడుదలై 25 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా క్లోసింగ్ కి చాలా దగ్గర్లో ఉన్నది..ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలకు కలిపి ఈ సినిమా ఎంత వసూళ్లను ఇప్పటి వరుకు రాబట్టిందో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.
Vikram
Also Read: Jr NTR: డైరెక్టర్ గా మారబోతున్న జూనియర్ ఎన్టీఆర్
ముందుగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం వసూలు చేసిన కలెక్షన్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే కమర్షియల్ గా ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందనే చెప్పొచ్చు..ఈ సినిమా తెలుగు రైట్స్ ని ప్రముఖ హీరో నితిన్ కేవలం 6 కోట్ల రూపాయలకే కొనుగోలు చేసాడు..అయితే అనూహ్యంగా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 18 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది..అంటే పెట్టిన డబ్బులకు మూడింతలు లాభాలు అన్నమాట..ఇటీవల కాలం లో ఈ స్థాయి లాభాలు తెచ్చిపెట్టిన సినిమా మరొకటి లేదు అని చెప్పొచ్చు..ఇక తమిళనాడు లో అయితే ఈ సినిమా ఇప్పటి వరుకు 170 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని సాధించి ఐదేళ్ల నుండి చెక్కు చెదరకుండా ఉన్న బాహుబలి పార్ట్ 2 రికార్డు ని బ్రేక్ చేసి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది..ఇక ఓవర్సీస్ లో అయితే కమల్ హాసన్ విశ్వరూపం చూపించాడని చెప్పాలి..అక్కడ ఈ సినిమా సుమారుగా 110 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది..ఒక్క #RRR మినహా ఈ ఏడాది మరో ఇండియన్ మూవీ ఈ స్థాయి వసూళ్లను రాబట్టలేదు అని చెప్పొచ్చు..కేరళలో 37 కోట్లు మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో 10 కోట్ల రూపాయిలు వసూలు చేసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలకు కలిపి 390 కోట్ల రూపాయిల గ్రాస్ మరియు 190 కోట్ల రూపాయిల షేర్ వసూలు చేసిందని అంచనా.
Kamal Haasan
Also Read: Vikram 4th Week Collections : కమల్ విక్రమ్ 4 వీక్స్ కలెక్షన్స్ !