Upcoming Movies: మొత్తమ్మీద ఈ వారం కూడా ‘అర్జున ఫల్గుణ’ రిలీజ్ కాబోతుంది. బాక్సాఫీస్ పై యుద్దానికి హీరో శ్రీవిష్ణు బాగానే సిద్ధం అయ్యాడు. పైగా శ్రీవిష్ణుకి ఇది ప్రతిష్టాత్మక సినిమా కూడా. ఫస్ట్ టైమ్ యాక్షన్ క్రైమ్ సినిమా చేస్తున్నాడు. అందుకే, ఈ సినిమా పై ప్రేక్షకులు కూడా మంచి అంచనాలే ఉన్నాయి. దానికి తోడు ఈ సినిమాకి ఓపెనింగ్స్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది.

శ్రీవిష్ణు హీరోగా దర్శకుడు తేజ మర్ని తెరకెక్కించిన చిత్రమిది. అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తోంది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 31న రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం తెలుగు బాక్సాఫీస్ కి ‘అఖండ’, పుష్ప సినిమాలతో ఊపు వచ్చింది. కాకపోతే ఏపీలో జగన్ దెబ్బకు వచ్చిన ఆ ఊపు కరిగిపోయేలా ఉంది.
ఒకవేళ ‘అర్జున ఫల్గుణ’కి మంచి కలెక్షన్స్ వస్తే.. మిగిలిన చిన్న సినిమాలు కూడా రిలీజ్ కి దైర్యంగా సిద్ధం అవుతాయి. కానీ, ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు రీత్యా ఓటీటీలోనే రిలీజ్ కావడానికి మరి కొన్ని సినిమాలు సిరీస్ లు రెడీ అయ్యాయి. వాటిల్లో నెట్ఫ్లిక్స్ లో వస్తోన్న క్యూర్ ఐ: సీజన్-6- పై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సిరీస్ డిసెంబరు 31 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
Also Read: చరణ్ నాలో సగ భాగం.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్!
అలాగే నెట్ ఫ్లిక్స్ లో రాబోతున్న మరో సిరీస్ కోబ్రా కాయ్ (సీజన్-4) పై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇది కూడా డిసెంబరు 31 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. అలాగే అమెజాన్ ప్రైమ్ లో రాబోతున్న లేడీ ఆఫ్ మేనర్ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇది కూడా డిసెంబరు 31 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
అన్నట్టు ఆహాలో వస్తోన్న ‘సేనాపతి’ పై కూడా మంచి బజ్ ఉంది. సీనియర్ హాస్య కథానాయకుడు రాజేంద్ర ప్రసాద్ హీరోగా వస్తోన్న ఈ సినిమాకి పవన్ సాధినేని దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఓటీటీ ‘ఆహా’లో డిసెంబరు 31న స్ట్రీమింగ్ కానుంది. కానీ ఈ సినిమా పై అయితే ఎలాంటి అంచనాలు లేవు. మరి ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి.
Also Read: 2021 బెస్ట్ సపోర్టింగ్ రోల్స్ ప్లే చేసిన నటులు వీళ్లే..