Pushpa Collections: ఐకాన్ స్టార్ బన్నీ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబో హ్యాట్రిక్ ఫిల్మ్ ‘పుష్ప’పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ టూ వీక్స్ దాటింది. అయినప్పటికీ ఈ చిత్రం నార్త్ ఇండియాలో రికార్డు వసూళ్లు చేస్తోంది. ఈ వారం విడుదల కావాల్సిన షాహిద్ కపూర్ ‘జెర్సీ’ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ కావడంతో ‘పుష్ప’కు కలిసొచ్చినట్లయింది. ‘పుష్ప’ పిక్చర్ విడుదలై 16 రోజులు కాగా, 16వ రోజున ఈ ఫిల్మ్‌కు హిందీ మార్కెట్‌లో రూ.ఆరున్నర కోట్ల గ్రాస్ కలెక్ట్ కావడం విశేషం. అలా ‘పుష్ప’ రాజ్ నార్త్‌లోనూ ‘తగ్గేదేలే’ అంటూ దూసుకుపోతున్నాడు.
బాలీవుడ్ సూపర్ స్టార్స్ సినిమాలకూ రిలీజైన ఇన్ని రోజుల తర్వాత ఈ వసూళ్లు రావడం కష్టం. కాగా, బన్నీ సినిమాకుఇది సాధ్యమైంది. గతేడాది బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘సూర్యవంశీ’కి థర్డ్ వీక్‌లో రూ.3.77 కోట్ల గ్రాసే కలెక్ట్ కాగా, డబ్బింగ్ సినిమా అయిన ‘పుష్ప’కు రూ.ఆరున్నర కోట్ల గ్రాస్ కలెక్ట్ అయింది. ఈ విషయం తెలుసుకుని బన్నీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకే ఒక్క సినిమాతో బన్నీ నార్త్ ఇండియాను కూడా షేక్ చేస్తున్నాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇంకా పెద్ద విశేషం ఏంటంటే.. ఇప్పటిదాకా ‘పుష్ఫ’ ఒక్క రోజులో కలెక్ట్ చేసిన అత్యధిక మొత్తం కూడా ఇదే. తొలి రోజు, తొలి వారాంతంలో కూడా ఏ రోజూ ఈ స్థాయిలో వసూళ్లు రాలేదు. ఒక సినిమాకు విడుదలైన 16వ రోజు హైయెస్ట్ సింగిల్ డే కలెక్షన్లు రావడం అన్నది బహుశా ఒక రికార్డు కావచ్చేమో. నెమ్మదిగా ‘పుష్ప’ హిందీ జనాలకు బాగా ఎక్కేస్తోందనడానికి ఇది రుజువు. ‘పుష్ప’ హిందీలో ఇంత బాగా ఆడుతుందన్న అంచనాలు ఎవ్వరికీ లేవు.
Also Read: హిందీలో కలెక్షన్లతో దుమ్ము రేపుతున్న అల్లు అర్జున్ “పుష్ప”… ఎంతంటే ?
‘పుష్ప’ చిత్రం హిందీలో విడుదల గురించి తను కాన్ఫిడెంట్‌గా లేనని డైరెక్టర్ సుకుమార్ ఇటీవల ప్రెస్ మీట్‌లో తెలిపారు. కాగా, ప్రజెంట్ ‘పుష్ప’ రాజ్ చేస్తున్న వసూళ్ల గురించి ఆశ్చర్యపోయి, ఆనందపడిపోతున్నారని తెలుస్తోంది. మొత్తంగా ‘పుష్ప’ ఫిల్మ్ నార్త్ ప్లస్ సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిపోతుందని మూవీ యూనిట్ సభ్యులు అంటున్నారు.
ఇకపోతే బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ విడుదల కూడా వాయిదా పడని నేపథ్యంలో ‘పుష్ప’ మూవీ థియేటర్స్‌లో ఇంకొన్ని రోజుల పాటు సక్సెస్ ఫుల్‌గా రన్ అయ్యే చాన్సెస్ మెండుగా ఉంటాయి. ఇప్పటి వరకు ఈ చిత్రం హిందీ మార్కెట్‌లో రూ.57 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా, అతి త్వరలోనే రూ.75 కోట్ల గ్రాస్ మార్కు రీచ్ అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Also Read: ‘పుష్ప’కి దూరంగా ఉంది అతనొక్కడే !