https://oktelugu.com/

Major Vs Vikram: మొదటి రోజు కలెక్షన్స్ లో ఎవరిది పై చెయ్యి..?

Major Vs Vikram: తెలుగు సినిమా ప్రేక్షకులకు గత కొంత కాలం నుండి ఫిలిం ఫెస్టివల్ నడుస్తుంది అనే చెప్పాలి..అఖండ సినిమా నుండి మొన్న విడుదల అయిన F3 వరుకు ప్రతి పెద్ద హీరో సినిమా కమర్షియల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తూనే ఉంది..కరోనా కారణంగా కుదేలు అయిపోయిన తెలుగు సినిమా ఇండస్ట్రీ..ఇప్పుడు వరుసగా వస్తున్న విజయవంతమైన సినిమాలతో ఆర్థికంగా బాగా పుంజుకుంది అనే చెప్పాలి..ఇక టీజర్స్ మరియు ట్రైలర్స్ తో మొదటి […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 4, 2022 / 12:06 PM IST

    Major Vs Vikram

    Follow us on

    Major Vs Vikram: తెలుగు సినిమా ప్రేక్షకులకు గత కొంత కాలం నుండి ఫిలిం ఫెస్టివల్ నడుస్తుంది అనే చెప్పాలి..అఖండ సినిమా నుండి మొన్న విడుదల అయిన F3 వరుకు ప్రతి పెద్ద హీరో సినిమా కమర్షియల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తూనే ఉంది..కరోనా కారణంగా కుదేలు అయిపోయిన తెలుగు సినిమా ఇండస్ట్రీ..ఇప్పుడు వరుసగా వస్తున్న విజయవంతమైన సినిమాలతో ఆర్థికంగా బాగా పుంజుకుంది అనే చెప్పాలి..ఇక టీజర్స్ మరియు ట్రైలర్స్ తో మొదటి నుండి ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను ఏర్పాటు చేసుకున్న మేజర్ మరియు విక్రమ్ సినిమాలు నిన్న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ బాషలలో ఘనంగా విడుదల అయిన సంగతి మన అందరికి తెలిసిందే..రెండిటికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన టాక్ వచ్చింది..అడవి శేష్ కెరీర్ లో మేజర్ సినిమా ఒక్క మైలు రాయిగా నిలిచిపోగా,విక్రమ్ సినిమా కమల్ హాసన్ కి బిగ్గెస్ట్ కం బ్యాక్ ఇచ్చిన మూవీ గా నిలిచింది..ఈ రెండు సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలకు కలిపి ఎంత కలెక్షన్స్ వచ్చాయో ఇప్పుడు మనం చూడబోతున్నాము.

    Adivi Sesh

    ముందుగా మనం కమల్ హాసన్ విక్రమ్ సినిమా గురించి మాట్లాడుకోవాలి..ఇటీవల కాలం లో కమల్ హాసన్ కెరీర్ లో చాలా కాలం తర్వాత ఒక్క రేంజ్ హైప్ తో విడుదల అయిన సినిమా ఇదే..ఫస్ట్ లుక్ దగ్గర నుండి టీజర్స్ మరియు ట్రైలర్స్ వరుకు ఈ సినిమా అభిమానుల్లో ఒక్క రేంజ్ ఆసక్తిని రేకెత్తించేలా చేసింది..దానితో ఈ సినిమాకి అద్భుతమైన ఓపెనింగ్స్ దక్కాయి..ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి మొదటి రోజు 6 కోట్ల రూపాయిల గ్రాస్ మరియు 3 కోట్ల 45 లక్షల రూపాయిల షేర్ వచ్చింది..కమల్ హాసన్ కి చాలా కాలం తర్వాత తెలుగు లో ఇది బెస్ట్ ఓపెనింగ్ అని చెప్పొచ్చు..ఇక తమిళనాడు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఈ సినిమా కి అక్కడ కేవలం మొదటి రోజు నుండే 25 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చింది..కమల్ హాసన్ కి అక్కడ ఇలాంటి ఓపెనింగ్ వచ్చి దశాబ్దం పైనే అయ్యింది..ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలకు కలిపి మొదటి రోజు దాదాపుగా 60 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చి ఉంటుంది అని అంచనా.

    Kamal

    Also Read: Auto Ram Prasad: గెటప్ శీను, సుధీర్ నన్నొదిలి వెళ్లిపోయారు.. ఒంటరిగా ఫీలవుతున్నా..: రాంప్రసాద్..

    ఇక మేజర్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాకి సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాతగా వ్యవహరించిన సంగతి మన అందరికి తెలిసిన విషయమే..26 /11 ముంబై లో జరిగిన ఉగ్రవాదుల దాడుల్లో వీరోచితంగా పోరాడి ప్రాణాలను వదిలిన మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ని ఆధారంగా తీసుకొని అడవి శేష్ హీరో గా నటించిన ఈ సినిమాకి కూడా అద్భుతమైన ఓపెనింగ్ వచ్చింది..విడుదలకి ముందు ప్రపంచవ్యాప్తంగా 13 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రం..మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల నుండే దాదాపుగా 8 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..మీడియం బడ్జెట్ సినిమాలలో ఈ స్థాయి ఓపెనింగ్ అంటే మాములు విషయం కాదు..మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషలకు కలిపి 18 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసిన ఈ సినిమా..ఫుల్ రన్ లో ఎంత వసూలు చేస్తుందో చూడాలి..అలా ఒక్కే రోజు విడుదల అయిన ఈ రెండు సినిమాలకు అదిరిపొయ్యే ఓపెనింగ్ దక్కింది.

    Also Read: Andhra University: మసకబారుతున్న ఏయూ ప్రతిష్ట.. వైసీపీ నేతలా వ్యవహరిస్తున్న వైస్‌ చాన్సలర్‌

    Recommended Videos:



    Tags