https://oktelugu.com/

Akhanda 50 days Celebrations: ఇటు 50 రోజుల సెలెబ్రేషన్స్.. అటు ఓటీటీ రిలీజ్ వేడుకలు !

Akhanda 50 days Celebrations: నటసింహం బాలయ్య అఖండ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ అంచనాలతో వచ్చి.. మొదటి రోజు నుంచి బాక్సాఫీస్ దగ్గర సునామీ కలెక్షన్లను రాబట్టింది. ఇక ఈ రీసెంట్‌ యాక్షన్‌ బ్లాక్‌బస్టర్‌ అఖండ ఓటిటి డేట్ కూడా వచ్చేసింది. ఇటీవల థియేటర్లలో మాస్‌ జాతర చేసిన ఈ చిత్రం, జనవరి 21 సాయంత్రం 6 గంటలకు హాట్ స్టార్ డిస్నీలో విడుదల కానున్నట్లు తాజాగా చిత్రబృందం అధికారికంగా ప్రకటించారు. డిసెంబర్ 2న విడుదలైన ఈ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 19, 2022 / 03:53 PM IST
    Follow us on

    Akhanda 50 days Celebrations: నటసింహం బాలయ్య అఖండ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ అంచనాలతో వచ్చి.. మొదటి రోజు నుంచి బాక్సాఫీస్ దగ్గర సునామీ కలెక్షన్లను రాబట్టింది. ఇక ఈ రీసెంట్‌ యాక్షన్‌ బ్లాక్‌బస్టర్‌ అఖండ ఓటిటి డేట్ కూడా వచ్చేసింది. ఇటీవల థియేటర్లలో మాస్‌ జాతర చేసిన ఈ చిత్రం, జనవరి 21 సాయంత్రం 6 గంటలకు హాట్ స్టార్ డిస్నీలో విడుదల కానున్నట్లు తాజాగా చిత్రబృందం అధికారికంగా ప్రకటించారు. డిసెంబర్ 2న విడుదలైన ఈ సినిమా 74 కోట్ల షేర్ వసూలు చేసింది.

    Akhanda 50 days Celebrations

    Also Read: బాలయ్య అఖండ ఓటిటి రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్… అఫిషియల్ గా అనౌన్స్ ?

    అన్నట్టు బాలయ్య కెరీర్‌లో మొదటి 50 కోట్ల షేర్ అందుకున్న సినిమా కూడా ఇదే అని సినీ ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. పైగా బాలయ్య ‘అఖండ’ సినిమా మరో రికార్డు సాధించింది. డిసెంబర్ 2న రిలీజైన ఈ మూవీ థియేటర్లలో విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఒకవిధంగా ఈ మధ్య కాలంలో ఈ స్థాయిలో ఆడిన సినిమా అఖండ ఒక్కటే కావడం విశేషం. దీంతో దేశవిదేశాల్లో బాలయ్య ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సెలెబ్రేషన్స్ చేసుకుంటున్నారు. మరోవైపు ఎల్లుండి నుంచి ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.

    మొత్తమ్మీద నేటికి కలెక్షన్స్ విషయంలో అఖండ ఏ మాత్రం తగ్గ లేదు. నిజానికి ఈ సినిమా కేవలం 8 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయింది. ఇక అప్పటి నుంచి ఈ సినిమా లాభాల్లోనే నడుస్తోంది. నిజానికి కరోనా సెకెండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ లో ఊపు కనిపించలేదు. దాంతో తెలుగు సినిమాకి కరోనా అనంతరం సాలిడ్ హిట్ పడలేదు. బాలయ్య అఖండతో ఇప్పుడు ఆ లోటు తీరిపోయింది. ఏది అయితే ఏం.. మొత్తానికి బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే బోణీ పడింది.

    Also Read: వైరల్ అవుతున్న బాలయ్య ‘మంగళవారం మెనూ’ వీడియో !

    Tags