ఎంత మంచి చాన్స్ పవన్ మిస్ చేసుకున్నాడంటే.. అసలు అవి వినియోగించుకుంటే పవన్ క్రేజ్ అమాంతం పెరిగేది. బీజేపీకి మద్దతిచ్చి ప్రచారం చేస్తే ఏకంగా సీఎం క్యాండిడేట్ గా కూడా పవన్ తెరపైకి వచ్చాడు. కానీ ఇప్పుడు దాన్ని మిస్ చేసుకున్నాడని జనసైనికులు బాధపడుతున్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం చేయని పవన్ పరిస్థితి ఇప్పుడు అడకత్తెరలో పోకచెక్కలా తయారైందట.. బీజేపీకి మద్దతైతే ఇచ్చాడు కానీ ఆ పార్టీపై పవన్ కళ్యాణ్ నమ్మకం ఉంచలేదు. అదే ఇప్పుడు ఆయన పరపతిని తగ్గించిందట..
Also Read: విద్యార్థులకు శుభవార్త.. పది రోజులు నో స్కూల్ బ్యాగ్ డే..!
దుబ్బాకలో బీజేపీకి మద్దతిచ్చాడు పవన్ కళ్యాణ్. అయితే అక్కడ పవన్ ప్రచారానికి వస్తాడని వార్తలు వచ్చాయి. అయితే బీజేపీపై నమ్మకం లేక.. కేసీఆర్ కు ఎదురు వెళ్లలేక పవన్ వెనక్కి తగ్గాడో తెలియదు కానీ ఆ ఉప ఎన్నికల్లో ప్రచారం చేయలేదు.
ఇక హైదరాబాద్ జీహెచ్ఎంసీలో పోటీచేస్తానని పవన్ ప్రకటించారు. బీజేపీ పెద్దలు వచ్చి సర్ధిచెప్పడంతో అభ్యర్థులను వెనక్కి తీసుకొని మద్దతు పలికారు. అయితే గత నవంబర్ 28,29 తేదీల్లో పవన్ ప్రచారం చేస్తారని ప్రకటించారు. కానీ ఎందుకో వెనక్కితగ్గాడు. గ్రేటర్ లో పవన్ ఎందుకు ప్రచారం చేయలేదో ఎవరికి తెలియదు.
Also Read: వైసీపీలో వర్గ విభేదాలు.. కొట్టుకుంటున్న నేతలు
గ్రేటర్ లోనూ బీజేపీ గెలవడంతో పవన్ డిఫెన్స్ లో పడ్డాడు. కాసింత తిరిగి ప్రచారం చేసినా ఆ క్రెడిట్ పవన్ ఖాతాలో పడేది. కానీ దాన్ని కూడా పవన్ మిస్ చేసుకున్నాడు. మంచి అవకాశాలను పవన్ కాలదన్నడని జనసైనికులు బాధపడుతున్నారు. ఈ రెండు చాన్సులు వినియోగించుకుంటే పవన్ కు క్రేజ్ వచ్చేదని అంటున్నారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్