
బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మే 28న ఈ సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇది మూడో చిత్రం కావడంతో అంచనాలు పెరిగిపోయాయి.
Also Read: రివ్యూః నాంది
రిలీజ్ కు దగ్గరపడుతున్నప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ మాత్రం ఇంకా ఖరారు కాలేదు. బోయపాటి, బాలయ్య సినిమా అంటే కచ్చితంగా అదిరిపోయే టైటిల్ ఉండాల్సిందే. అయితే ఈ సినిమా టైటిల్ పై ఇప్పటికే అనేక రూమర్స్ వచ్చాయి. అందులో మెయిన్ గా ‘మోనార్క్’ అనే టైటిల్ తో పాటు డేంజర్ అనే టైటిల్ కూడా బాగా వినిపించింది.
ఓ దశలో మోనార్క్ టైటిల్ ను ఫైనల్ చేశారని కూడా బాగా వార్తలు వచ్చాయి. ఇక ఆల్ మోస్ట్ ఇదే టైటిల్ ను ఫిక్స్ అనుకునే లోపు కొత్తగా మరో మాస్ టైటిల్ రేసులోకి వచ్చింది. ‘టార్చ్ బెర్రర్’ అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఇప్పుడు బాలయ్య- బోయపాటి సినిమాకి పెట్టబోతున్నారట. టార్చ్ బెర్రర్ అనే డైలాగ్ ఎన్టీఆర్ సినిమాలో బాగా పేలింది. బాలయ్యకు కూడా ఈ టైటిల్ బాగా సూట్ అవుతొందని ఆలోచిస్తున్నారట..
Also Read: ట్రైలర్ టాక్: పెళ్లాం పోరు.. సస్పెన్స్ థ్రిల్లర్ గా ‘క్షణక్షణం’
కానీ ఇప్పుడు మరో టైటిల్ వార్తల్లోకి వచ్చింది. తాజాగా ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట.. బాలకృష్ణ ఇమేజ్ కు ఈ టైటిల్ సరిగ్గా సరిపోతుందని భావిస్తున్నారట చిత్రం యూనిట్. మరి ఇన్ని టైటిల్స్ మధ్య బాలయ్య సినిమాకు ఏ టైటిల్ ఫిక్స్ చేస్తారన్నది వేచిచూడాల్సిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్