
మనం ఇప్పుడు రోడ్లపై నుంచి వెళ్తుంటే ఎక్కువగా కార్లే కనిపిస్తాయి.. ఎక్కడో చోట బైక్ లు దర్శనమిస్తున్నాయి.. ఇదే 2000-2010 మధ్య కాలంలో స్కూటర్లు ఎక్కువగా కనపడి ఎక్కడో చోట సైకిల్ కనిపించేంది. కానీ 1600 ఏళ్ల కింద సైకిల్ ఉంటే ధనవంతుల కింద లెక్కకట్టేవారు.. దీంతో అప్పటి ప్రభుత్వం సైకిల్ కు పన్ను వేసేది. అంతేకాకుండా ఎడ్లబండ్లు, జట్కాలకు కూడా లైసెన్స్ కూడా ఇచ్చేవారు. ఆ లైసెన్స్ లేకపోతే సైకిల్ గానీ.. ఎడ్లబండి గానీ రోడ్డు మీద తిరగే అవకాశం లేదు. ఒకవేళ వస్తే ఫైన్ వేసేవారు. అది సరే.. ఇది ఎక్కడా అనే డౌట్ మీకు రావచ్చు.. ఫుల్ స్టోరీ కోసం కిందికి వెళ్లండి..
బంగాళఖాతం సముద్ర తీరాన ఉన్న మహానగరం విశాఖపట్నం శతాబ్దం కిందట చిన్న గ్రామం. సముద్రం ఉండడంతో నౌకల ద్వారా ఇక్కడ సహజ సిద్ధంగా ఓడరేవు ఏర్పడింది. ఆ కాలంలో వన్ టౌన్ ఏరియాలో మాత్రమే ఇళ్లు ఉండేవి. రాత్రయితే బయటకు ఎవరూ వచ్చేవారు కాదు. ఆ తరువాత 1800-1802 మధ్య విశాఖకు క్రిస్టియన్ల రాక మొదలైంది. దీంతో బ్రిటిష్ వారు 1805లో విశాఖకు చేరుకున్నారు. ఆ తరువాత విశాఖ పట్టణ స్థాయికి ఎదిగింది.
1858లో విశాఖ మున్సిపల్ వలంటరీ అసోసియేషన్ మొదలైంది. అప్పటి నుంచి వ్యాపారులు, జమీందార్లు, స్వచ్ఛంధంగా సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వలంటరీ అసోసియేషన్ నుంచి 1865లో మున్సిపల్ కమిషన్ గా మారింది. ఇందులో కలెక్టర్లు, రెవెన్యూ అఫీసర్లు ఉండేవారు. ఎన్నికలు లేకుండా నామినేటెడ్ పదవులు ఇచ్చేవారు. ఆ తరువాత 1884లో కమిషన్ కౌన్సిల్ గా మారింది. అప్పుడు విశాఖలో కేవలం 6 .వార్డులే ఉన్నాయి. 1979లో కార్పొరేషన్ స్థాయికి ఎదిగింది.
ఆదాయం కోసం మున్సిపల్ వలంటీర్ అసోసియేషన్ అప్పటి ప్రజా రవాణా, సరుకు రవాణా కోసం వాడే సైకిళ్లు, ఎడ్లబండ్లు, జట్కా బండ్లు లైసెన్స్ విధానం తీసుకొచ్చింది. ఏడాది కాలం పాటు ఆ లైసెన్స్ కి వాలిడెటి ఉండేది. ఆ తరువాత రెన్యూవల్ చేసుకోవాలి. ఎవరైనా లైసెన్స్ తీసుకోకపోయినా, రెన్యూవల్ చేసుకోకపోయినా అధికారులు తనిఖీల్లో పట్టుబడేవారు. వీరికి చిన్న లోహపు బిళ్లను మెడలో వేసేవారు. ఆ బిళ్ల లేకపోతే సైకిళ్లు, గుర్రాలను, ఎడ్లను అధికారులు జప్తు చేసి మున్సిపల్ కార్యాలయంలో ఉంచేవారు.
ప్రస్తుతం రూ.3600 కోట్ల బడ్జెట్తో ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చెందింది. విశాఖపట్నం దినాదినాభివృద్ధి చెందుతూ ఈ స్థాయికి చేరుకుందని మాజీ మేయర్ ఒకరు తెలిపారు. ముఖ్యంగా మహిళలకు ప్రతీ బుధవారాన్ని కేటాయించేవారమని, వారి సమస్యల గురించి విన్నామన్నారు. 2012లో పాలకవర్గం పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచి ప్రత్యేక అధికారుల పాలనలోనే కొనసాగుతోంది గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్. ప్రస్తుతం దీని పరిధిలోకి అనకాపల్లి, భీమునిపట్నం పురపాలక సంఘాలతో పాటు మరికొన్ని పంచాయతీలను కలిపారు.