దేశంలో ఎగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్లతో పాటు మధ్య తరగతి ప్రజలు సైతం కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తర్వాత కారు కొనుగోలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే సెప్టెంబర్ నెల 1వ తేదీ నుంచి కారు కొనుగోలు విషయంలో నిబంధనలు మారనున్నాయని తెలుస్తోంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి విక్రయించే అన్ని వాహనాలకు యజమాని, డ్రైవర్లు, ప్రయాణికులకు కలిపి ఐదు సంవత్సరాల బీమా తప్పనిసరి చేయాలని నిబంధనలు వెలువడ్డాయి.
2016 సంవత్సరం హొగినేకల్ ప్రాంతంలో సడయప్పన్ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. కుటుంబ సభ్యులు నష్టపరిహారం కోరుతూ ఈరోడ్ మోటారు ప్రమాద పరిహార ట్రైబ్యునల్‌లో కేసు వేయగా ట్రైబ్యూనల్ సడయప్పన్ ఫ్యామిలీకి 14,65,000 రూపాయలు నష్టపరిహారంగా చెల్లించాలని ఆదేశాలను జారీ చేసింది. న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ ట్రైబ్యూనల్ తీర్పును వ్యతిరేకిస్తూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది.
జస్టిస్ వైద్య నాథన్ ఈ కేసు విచారణకు రాగా సడయప్పన్ వాహనం నడపలేదని అందువల్ల లక్ష రూపాయలు మాత్రమే చెల్లిస్తామని కంపెనీ తెలిపింది. కోర్టు రవాణశాఖ అదనపు కార్యదర్శి కోర్టు ఆదేశాలను బీమా కంపెనీలకు తగిన సూచనలు చేసింది. ఇందులో భాగంగా డ్రైవర్, ప్యాసింజర్లు, వాహన యజమానికి ఐదేళ్ల ఇన్సూరెన్స్ కవరేజీ ఉండాలని జస్టిస్ వైద్యనాథన్ వెల్లడించారు.
కోర్టు ఆదేశాల వల్ల ఇకపై ఇన్సూరెన్స్ ప్రీమియం భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇన్సూరెన్స్ సంస్థలు కోర్టు ఆదేశాల ప్రకారం కొత్త పాలసీలను డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం మోటార్ ఇన్సూరెన్స్లతో మూడు విధానాలు అమలులో ఉన్న సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాల వల్ల కారు కొనుగోలుదారులపై అదనపు భారం పడనుంది.