https://oktelugu.com/

ట్రంప్ నకు ఇక రాజకీయ మరణమేనా?

ఇన్నాళ్లు అగ్రరాజ్యం అంటే అదో ఘనత.. అయితే ప్రపంచంలోనే తొలి పురాతన ప్రజాస్వామ్య దేశంగా కీర్తికెక్కిన అమెరికా పరువును గంగలో కలిపేశాడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. నూతన అధ్యక్షుడిని ఆమోదించే అమెరికన్ కాంగ్రెస్ సమావేశంపైకి తన మద్దతుదారులను పంపి రక్తం చిందించారు. కొందరు ప్రాణాలు తీశారు. అమెరికా చరిత్రలోనే దీన్ని చీకటి రోజుగా అక్కడి వారు అభివర్ణిస్తున్నారు. ప్రపంచ దేశాల్లో అమెరికా పరువు తీసిన ట్రంప్ ను ఊరికే వదిలిపెట్టకుండా అక్కడ అందరూ ఏకమవుతున్న పరిస్థితి నెలకొంది. […]

Written By:
  • NARESH
  • , Updated On : January 10, 2021 4:18 pm
    Follow us on

    ఇన్నాళ్లు అగ్రరాజ్యం అంటే అదో ఘనత.. అయితే ప్రపంచంలోనే తొలి పురాతన ప్రజాస్వామ్య దేశంగా కీర్తికెక్కిన అమెరికా పరువును గంగలో కలిపేశాడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. నూతన అధ్యక్షుడిని ఆమోదించే అమెరికన్ కాంగ్రెస్ సమావేశంపైకి తన మద్దతుదారులను పంపి రక్తం చిందించారు. కొందరు ప్రాణాలు తీశారు. అమెరికా చరిత్రలోనే దీన్ని చీకటి రోజుగా అక్కడి వారు అభివర్ణిస్తున్నారు. ప్రపంచ దేశాల్లో అమెరికా పరువు తీసిన ట్రంప్ ను ఊరికే వదిలిపెట్టకుండా అక్కడ అందరూ ఏకమవుతున్న పరిస్థితి నెలకొంది.

    Also Read: అమెరికాను వీడని కరోనా

    ఇప్పుడు అమెరికాలోని రాజకీయ, రాజ్యాంగ, న్యాయ కోవిదులంతా పాత అధ్యక్షుడిని రాజకీయాల నుంచి శాశ్వతంగా సాగనంపేందుకు రెడీ అయ్యారా? అంటే ఔననే సమాధానం వస్తోంది.

    అమెరికన్ కాంగ్రెస్ పై దాడిని అక్కడి ప్రజాప్రతినిధులు, డెమొక్రటిక్ పార్టీ సీరియస్ గా తీసుకుంటోంది. అధ్యక్షుడు కొలువుదీరే జనవరి 20కంటే ముందుగానే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను పదవీచిత్యున్ని చేయడానికి అవకాశాలు పరిశీలిస్తున్నట్టు తెలిసింది. మరోసారి ఏ అధ్యక్షుడిగా ఇలా ప్రజాస్వామ్యం దాడి చేయకుండా.. ట్రంప్ కు గట్టి షాకిచ్చి సంకేతాలు పంపాలని.. ట్రంప్ నోటికి తాళం పడేలా గట్టి చర్య తీసుకోవాలని భావిస్తున్నారు.

    ఇక మరోసారి ట్రంప్ అధ్యక్ష పదవికి పోటీచేయకుండా ఉండేలా ప్రత్యర్థులు డెమోక్రాట్లు ఇప్పుడు వ్యూహ రచన చేస్తున్నారు. ఎందుకంటే అమెరికాలో రెండు సార్లు ఒక వ్యక్తి అధ్యక్షుడు కావచ్చు. ఒకసారి అయిన ట్రంప్ ఇప్పటికే 2024లో మళ్లీ పోటీచేస్తానని ప్రకటించారు.

    ట్రంప్ కు తగిన గుణపాఠం దిశగా డెమొక్రాట్లు ఆలోచిస్తున్నారు. ట్రంప్ పై రెండోసారి అభిశంసన తీర్మానం చేసి అవమానించాలని.. లేదంటే 25వ రాజ్యాంగ సవరణను ఉపయోగించి పదవి నుంచి దింపాలని యోచిస్తున్నారు. అయితే అభిశంసన తీర్మానం పెద్ద ప్రక్రియ కావడంతో వాదనలు వినడం.. సెనెట్ కు పంపడం ఆమోదించడం.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేత విచారణ తదితర కావాలంటే సమయం పడుతుంది. దీనికి మూడింట రెండొంతుల మెజార్టీ అవసరం.

    Also Read: వ్యవసాయం-స్వేచ్ఛా మార్కెట్‌

    ప్రస్తుత బలాబలాలు చూస్తే ట్రంప్ పార్టీ రిపబ్లికన్లకు చెందిన 17 మంది డెమొక్రాట్లకు మద్దతు ఇస్తేనే ఇది సాధ్యం. కానీ వారు ఎట్టిపరిస్థితుల్లోనూ అలాచేయరు. దీంతో ట్రంప్ ను దించడం అంత సులువు కాదు.

    ఇక భవిష్యత్తులోనూ ట్రంప్ ను అధ్యక్ష పదవికి పోటీచేయకుండా నిషేధించే తీర్మానాన్ని సెనెట్ ఆమోదించే అవకాశాలు ఉన్నాయి. ఈ తీర్మానానికి సాధారణ మెజార్టీ చాలు. ఇది ప్రవేశపెడితే ట్రంప్ పై వ్యతిరేకతో రిపబ్లికన్లు కొందరు తీర్మానానికి మద్దతు ఇవ్వవచ్చు. ట్రంప్ పై నిషేధం విధిస్తే కొత్త రిపబ్లికన్ నేతకు వచ్చే సారి అధ్యక్ష పదవికి పోటీచేయవచ్చు. అందుకే ఈ ప్రతిపాదనను డెమోక్రాట్లు అమలు చేయాలని చూస్తున్నారు. ఇలా అయితే ట్రంప్ ను పోటీచేయకుండా పూర్తిగా నిషేధించడంతోపాటు కొత్త రిపబ్లికన్ నేతకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. రిపబ్లికన్లు ట్రంప్ బాధ ఇక తమకు తప్పుతుందని.. తమలో ఒకరు కొత్త అధ్యక్షుడిగా పోటీచేయవచ్చని ఈ తీర్మానానికి మద్దతు పలికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

    25వ రాజ్యాంగ సవరణ  కానీ.. అభిశంసనకు కానీ అంత త్వరగా తేలే అంశం కాదు.. అందుకే ఇప్పుడు భవిష్యత్ లో ట్రంప్ పోటీచేయకుండా నిషేధం విధించేలా అభిశంసన తీర్మానం చేయాలనేది డెమొక్రాట్ల ఆలోచనగా కనిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు పనిచేస్తుంది? డెమొక్రాట్ల పట్టుదల నెరవేరుతుందా చూడాలి.

    మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు