
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి తెలంగాణ రాష్ట్ర సమితికి ఎదురు లేకుండా పోయింది. ఏ ఎన్నికల్లో చూసినా వార్ వన్ సైడ్ అన్నట్లే నడిచేవి. అయితే.. ఏ ఎన్నికల సందర్భంలో చూసినా టీఆర్‌ఎస్ పన్నిన వ్యూహంలో మిగితా పార్టీలు చిక్కుకునేవి. కానీ.. ఈసారి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. కమలం వేస్తున్న ఎత్తుల్లో గులాబీ నేతలు చిక్కుకుంటున్నారు.
Also Read: తెలంగాణలో ఆంధ్ర పార్టీలకే స్పేస్ లేనట్లే..
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ‘బీజేపీ మా ప్రధాన ప్రత్యర్థి’ అని ప్రకటించిన టీఆర్‌ఎస్.. ఈసారి తమకు మద్దతుదారుగా ఉండే మజ్లి్‌స్‌ను ప్రధాన పోటీదారుగా ప్రకటించడం వెనక ఉద్దేశం ఏంటో అర్థం కాకుండా ఉంది. ఇటీవల ముగిసిన దుబ్బాకతోపాటు తాజా జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారమే ఇందుకు కారణం. రాష్ట్రంలో గులాబీ దళానికి కమలం పార్టీ ప్రధాన ప్రత్యర్థిగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విషయాన్ని టీఆర్‌ఎస్ నేతలు అంగీకరించినా, అంగీకరించకపోయినా వారి చేతల ద్వారా మాత్రం స్పష్టమవుతోందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
తమకు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ అని మంత్రి తలసాని, తమ ప్రధాన పోటీదారు మజ్లిస్ అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. కానీ, ప్రచారంలో టీఆర్‌ఎస్ ప్రధానంగా బీజేపీనే లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తోంది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇద్దరూ అభివృద్ధి అజెండాను పక్కకుపెట్టి.. బీజేపీ విమర్శలకు ప్రతి విమర్శలు చేయాల్సి వస్తోందని, తద్వారా తమకు బీజేపీతోనే ప్రధాన పోటీ అనే సంకేతాన్ని బయటకు చెప్పినట్టయిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
Also Read: బీజేపీ బౌలింగ్: చంద్రబాబు ఔట్.. పవన్ బ్యాటింగ్!
ఫలితాల తర్వాత మజ్లిస్ అభ్యర్థి మేయర్ అవుతారని, టీఆర్‌ఎస్, ఎంఐఎం మధ్య పొత్తు ఉందని బీజేపీ నేతలు విమర్శిస్తే.. మజ్లి్‌స్‌తో తమకు పొత్తు లేదని మంత్రి కేటీఆర్.. టీఆర్‌ఎస్‌ను ఓడిస్తామని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ప్రకటించడం గందరగోళానికి తెరతీసింది. వరద సాయంపై బండి సంజయ్.. సీఎం కేసీఆర్‌కు సవాల్ విసరడాన్ని వ్యూహాత్మక ఎత్తుగడగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఆయన విసిరిన సవాల్‌ను టీఆర్‌ఎస్ నేతలు ఎవరూ స్వీకరించలేదని, కానీ, ఆ తర్వాత ప్రచారం మొత్తం ‘విద్వేష రాజకీయాల’ చుట్టూనే తిరుగుతున్న విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. అయితే.. ఈ ఎన్నికలను చూస్తే బీజేపీ వేసిన గాలానికి టీఆర్‌ఎస్ నేతలు చిక్కుతున్నట్లు కనిపిస్తోంది. బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు టీఆర్‌ఎస్ నేతలు ఇట్టే స్పందించి జవాబు ఇవ్వాల్సి వస్తోంది. బండి సంజయ్ చలాన్లు, సర్జికల్ స్ట్రైక్స్ వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.
మొత్తంగా బీజేపీ నేతల ట్రాక్ లో టీఆర్ఎస్ పడి పొరపాట్లు చేస్తోందని.. అదే గులాబీ పార్టీకి మైనస్ గా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్