https://oktelugu.com/

టైమ్స్ నౌ సర్వే: ఏ రాష్ట్రంలో ఎవరిది గెలుపు?

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు ఎవరిది? అనే తేల్చబోతున్నాయి దేశంలో జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు. కీలకమైన పెద్ద రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు ఖచ్చితంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి రెఫరెండంగానే కనిపిస్తున్నాయి. కరోనా కల్లోలం తర్వాత ధరలు భారీగా పెరిగి ప్రజలు అల్లాడుతున్న వేళ.. మోడీ సర్కార్ పై ఆగ్రహం పెల్లుబుక్కుతున్న వేళ జరుగుతున్న ఈ ఎన్నికలు ఖచ్చితంగా వచ్చే సార్వత్రిక ఎన్నికలను ప్రభావితం చేస్తాయని అంటున్నారు. అందుకే జాతీయ, ప్రాంతీయ పార్టీలు సర్వశక్తులు […]

Written By:
  • NARESH
  • , Updated On : March 9, 2021 5:41 pm
    Follow us on

    వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు ఎవరిది? అనే తేల్చబోతున్నాయి దేశంలో జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు. కీలకమైన పెద్ద రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు ఖచ్చితంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి రెఫరెండంగానే కనిపిస్తున్నాయి.

    కరోనా కల్లోలం తర్వాత ధరలు భారీగా పెరిగి ప్రజలు అల్లాడుతున్న వేళ.. మోడీ సర్కార్ పై ఆగ్రహం పెల్లుబుక్కుతున్న వేళ జరుగుతున్న ఈ ఎన్నికలు ఖచ్చితంగా వచ్చే సార్వత్రిక ఎన్నికలను ప్రభావితం చేస్తాయని అంటున్నారు. అందుకే జాతీయ, ప్రాంతీయ పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.

    ఈ నేపథ్యంలోనే జనం నాడిని తెలుసుకునేందుకు ‘టైమ్స్ నౌ-సీ ఓటర్’ సంస్థ చేపట్టిన ఒపినీయన్ పోల్ సర్వే ఫలితాలు వచ్చే ఎన్నికల్లో గెలుపు ఎవరిది అనేది తేల్చేశాయి.

    పశ్చిమ బెంగాల్ లో మరోసారి తృణమూల్ కాంగ్రెస్ దే విజయం అని.. మమతా బెనర్జీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని టైమ్స్ నౌ సర్వేతేల్చింది. స్వల్ప ఆధిక్యంతో మమత గట్టెక్కుతుందట.. ఇక తమిళనాడులో డీఎంకే-కాంగ్రెస్-లెఫ్ట్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తేలింది. కేరళలో మళ్లీ కమ్యూనిస్టుల ఎల్డీఎఫ్ దే విజయం అని తేలింది. ఇక అసోం, పుదుచ్చేరిలో మాత్రం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిదే అధికారం అని తేలింది.

    *బెంగాల్ లో దీదీనే
    294 అసెంబ్లీ సీట్లు ఉన్న బెంగాల్ లో బీజేపీ బలంగా పోరాడినా అధికారం కష్టమేననట.. ఈసారి 107 సీట్లు రావచ్చొని తేలింది. ఇక 76 సీట్లు కాంగ్రెస్-వామపక్షాలు గెలువవచ్చని తేలింది. మమతా బెనర్జీ 147 సీట్లపైనే సాధిస్తుందని తేలింది.

    -తమిళనాట డీఎంకేదే అధికారం
    234 సీట్లు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో డీఎంకే-కాంగ్రెస్ కూటమి 158 సీట్లు సాధించడం పక్కాగా తేలింది. ఇక అన్నాడీఎంకే-బీజేపీ కూటమి 65 స్థానాలకే పరిమితం అయ్యే అవకాశం ఉంది.

    కేరళలో సీపీఎం నేతృత్వంలోని కూటమిదే మరోసారి అధికారం.. మొత్తం 140 సీట్లలో ఈసారి 82 సీట్లు రావచ్చు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కు 56 స్థానాలు రావచ్చని తేలింది. బీజేపీ సీట్లు సాధించడం కష్టమే.

    -పుదుచ్చేరిలో ఎన్డీఏ
    30 సీట్లు ఉన్న పుదుచ్చేరి అసెంబ్లీలో ఎన్టీఏ కూటమి 18 సీట్లు, యూపీఏ కూటమి 12 సీట్లు గెలుచుకుంటాయని సర్వే తేల్చింది.

    -అసోంలో 126 స్థానాల్లో ఈసారి బీజేపీ, కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ సాగనుందని తేలింది. ఎన్టీఏకు 67, యూపీఏకు 57 సీట్లు రావచ్చని.. ఇక్కడ గెలుపు ఎవరిది అనేది తేల్చడం కష్టమని తేలింది.