https://oktelugu.com/

ఏపీలో మొత్తం 32 కొత్త జిల్లాలు.. అవి ఇవే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన వేగం పుంజుకుంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన జరగనుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన పాదయాత్రలో రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీకు తగ్గట్టుగా ఇప్పుడు కార్యాచరణ ప్రారంభమైంది. రాష్ట్రంలో ప్రస్తుతం 13 జిల్లాలుండగా.. మరో 19 రాష్ట్రాల ఏర్పాటుకు జగన్‌ ప్లాన్‌ చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పుడు ఆ 32 […]

Written By:
  • NARESH
  • , Updated On : November 9, 2020 / 10:39 AM IST
    Follow us on

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన వేగం పుంజుకుంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన జరగనుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన పాదయాత్రలో రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీకు తగ్గట్టుగా ఇప్పుడు కార్యాచరణ ప్రారంభమైంది. రాష్ట్రంలో ప్రస్తుతం 13 జిల్లాలుండగా.. మరో 19 రాష్ట్రాల ఏర్పాటుకు జగన్‌ ప్లాన్‌ చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పుడు ఆ 32 జిల్లాలు కూడా ఏంటో సోషల్‌ మీడియాలో చుట్టేస్తున్నాయి.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

    జిల్లాల పునర్విభజనపై ఇప్పటికే ఏర్పాటైన కమిటీకి ప్రత్యేక సబ్‌ కమిటీలు ఏర్పాటు చేసింది. ఈ మేరకు నాలుగు సబ్‌ కమిటీలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. జిల్లాల బౌండరీలు, నియంత్రణ, లీగల్ వ్యవహారాల అధ్యయనానికి కమిటీ- 1, నిర్మాణాత్మక, సిబ్బంది పునర్విభజన అధ్యయనానికి కమిటీ- 2, ఆస్తులు, మౌలిక సదుపాయాల అధ్యయనానికి కమిటీ- 3, ఐటీ సంబంధిత పనుల అధ్యయనానికి సబ్‌ కమిటీ- 4 ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. రాష్ట్ర కమిటీలో సహాయంగా ఉండేందుకు జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్‌ చైర్మన్‌గా 10 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది.

    వివిధ రాష్ట్రాల్లో జిల్లాల పునర్విభజనపై అధ్యయనం చేయాలని ఆయా కమిటీలను ప్రభుత్వం ఆదేశించింది. ప్రాథమికంగా ఆరు నెలలపాటు సచివాలయం కొనసాగుతుందని ప్రభుత్వం పేర్కొంది. సబ్ కమిటీలు, జిల్లా స్థాయి కమిటీలు, సచివాలయ బాధ్యతలను ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 25 జిల్లాలుగా విభజించాలని గత ఎన్నికల సమయంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జిల్లాల పునర్విభజనకు ఏపీ ప్రభుత్వం వడివడిగా అడుగులేస్తోంది.

    Also Read: లోకేష్ కు అస్త్రంలా మారిన పోలవరం

    కొత్త జిల్లాల ఏర్పాటుపై వచ్చే ఏడాది జనవరి కల్లా దీనిపై ఓ క్లారిటీ వస్తుందని తెలుస్తోంది. కొత్త జిల్లాలు ఏర్పాటు కానుండడంతో అసలు రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయనే చర్చ జరుగుతోంది. కొంతమంది 25 జిల్లాలని.. మరికొందరు 26, 27 వరకు ఉంటాయని చెబుతున్నారు. ఇలా ఎవరికి తోచిన లెక్కలు వాళ్లు చెబుతున్నారు. అంతేకాదు ఒకటి రెండు చోట్ల కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ వినిపిస్తోంది. అయితే.. తాజాగా సోషల్ మీడియాలో మరో ప్రచారం జరుగుతోంది. 25 కాదు ఏకంగా 32 జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయని.. ఓ లిస్ట్‌తో సహా చక్కర్లు కొడుతోంది.

    ఆ లిస్ట్‌ ప్రకారం ఏర్పాటు కాబోతున్న కొత్త జిల్లాలు ఇవే.. పలాస, శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం, అరకు, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, నర్సాపురం, ఏలూరు, మచిలీపట్నం, విజయవాడ, అమరావతి, గుంటూరు, బాపట్ల, నర్సరావుపేట, మార్కాపురం, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, తిరుపతి, చిత్తూరు, మదనపల్లె, హిందూపురం, అనంతపురం, ఆదోని, కర్నూలు, నంద్యాల, కడప, రాజంపేట.

    ఈ జిల్లలాల పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాల లిస్టు ఇలా ఉంది. పలాస (ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం),  శ్రీకాకుళం (శ్రీకాకుళం, ఆముదాలవలస, నరసన్నపేట, ఎచ్చెర్ల, రాజాం), పార్వతీపురం (పార్వతీపురం, కురుపాం, సాలూరు, పాలకొండ), విజయనగరం (విజయనగరం, చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల, శృంగవరపుకోట, బొబ్బిలి), విశాఖపట్నం (భీమిలి, విశాఖ ఈస్ట్, విశాఖ వెస్ట్, విశాఖ నార్త్, విశాఖ సౌత్, గాజువాక, పెందుర్తి), అరకు (అరకు, పాడేరు, జి.మాడుగుల), అనకాపల్లి (అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, యలమంచిలి, పాయకరావుపేట, తుని), కాకినాడ (ప్రత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట, పెద్దాపురం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, రామచంద్రపురం), రాజమండ్రి (అనపర్తి, రాజానగరం, రంపచోడవరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, నిడదవోలు), అమలాపురం (రాజోలు, అమలాపురం, ముమ్మిడివరం, గన్నవరం, మండపేట, కొత్తపేట), నరసాపురం (తణుకు, ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం), ఏలూరు (గోపాలపురం, పోలవరం, చింతలపూడి, దెందులూరు, ఉంగుటూరు, ఏలూరు), మచిలీపట్నం (కైకలూరు, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు), విజయవాడ (తిరువూరు, నూజివీడు, గన్నవరం, పెనమలూరు, విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, మైలవరం), అమరావతి (పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, జగ్గయ్యపేట, నందిగామ), గుంటూరు (తెనాలి, ప్రత్తిపాడు, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, పొన్నూరు), బాపట్ల (రేపల్లె, వేమూరు, బాపట్ల, చీరాల, పర్చూరు), నరసరావుపేట (చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల, వినుకొండ), మార్కాపురం (ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, దర్శి), ఒంగోలు (అద్దంకి, సంతనూతలపాడు, ఒంగోలు, కొండెపి, కందుకూరు), నెల్లూరు (కావలి, కొవ్వూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఆత్మకూరు, ఉదయగిరి), గూడూరు (సర్వేపల్లి, వెంకటగిరి, గూడూరు, సూళ్లూరుపేట), తిరుపతి (శ్రీకాళహస్తి, సత్యవేడు, నగరి, తిరుపతి, చంద్రగిరి), చిత్తూరు (పూతలపట్టు, చిత్తూరు, గంగాధర నెల్లూరు, పలమనేరు, కుప్పం), మదనపల్లి (పీలేరు, పుంగనూరు, మదనపల్లి, తంబళ్లపల్లి), హిందూపురం (కదిరి, ధర్మవరం, పుట్టపర్తి, పెనుగొండ, మడకశిర, హిందూపురం), అనంతపురం (రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, ఉరవకొండ, అనంతపురం, రాప్తాడు, శింగనమల, తాడిపత్రి), ఆదోని (పత్తికొండ, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం), కర్నూలు (నందికొట్కూరు, కర్నూలు, డోన్, కోడుమూరు), నంద్యాల (శ్రీశైలం, నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె, పాణ్యం), కడప (జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం, పులివెందుల, కడప), రాజంపేట (బద్వేలు, రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి).

    Also Read: వైరల్: వైసీపీ ఎమ్మెల్యే ఆడియో టేప్ లీక్ కలకలం

    ఇక కోరుకున్న వాళ్లందరికీ జిల్లాలను ఇస్తున్న జగన్.. అనాదిగా గుంతకల్ ను జిల్లా చేయాలని అక్కడి ప్రజలు కోరినా దాన్ని అధికారులు పట్టించుకోలేదు. 1956 నుంచి గుంతకల్ ను జిల్లాగా చేయాలన్న డిమాండ్ పరిగణలోకి  తీసుకోవాలని వారంతా కోరుతున్నారు.

    మొత్తంగా ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ మరోసారి ముమ్మరం కావడంతో తమ ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలంటే ఇప్పటికే వినతులు ప్రారంభమయ్యాయట. అంతే కాదు.. అసలు ఎన్ని జిల్లాలు ఏర్పాటు చేస్తారో ఎక్కడా ప్రభుత్వం వెల్లడించకున్నా.. సోషల్‌ మీడియాలో మాత్రం 32 జిల్లాలంటూ లిస్టుతో సహా వైరల్‌ కావడం ఆశ్చర్యానికి గురిచేసింది.