https://oktelugu.com/

రైలు ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన రైల్వే శాఖ..?

కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల రైలు ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. దేశంలో ప్రస్తుతం పరిమిత సంఖ్యలో రైళ్లు నడుస్తున్నాయి. అయితే ప్రయాణికులకు రైలు ప్రయాణం చేయాలంటే అమలులో ఉన్న నిబంధనల వల్ల సమస్యలు ఏర్పడుతున్నాయి. రైలు ప్రయాణాల వల్ల ప్రయాణికులకు కరోనా సోకకూడదనే ఉద్దేశంతో కొన్ని నెలల క్రితం కేంద్రం రైలు ప్రయాణం చేసేవాళ్లు గంటన్నర ముందే రైల్వే స్టేషన్ కు చేరుకోవాలని సూచించింది. ఈ నిబంధన వల్ల రైలు ప్రయాణికులు తీవ్ర […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 24, 2020 3:03 pm
    Follow us on


    కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల రైలు ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. దేశంలో ప్రస్తుతం పరిమిత సంఖ్యలో రైళ్లు నడుస్తున్నాయి. అయితే ప్రయాణికులకు రైలు ప్రయాణం చేయాలంటే అమలులో ఉన్న నిబంధనల వల్ల సమస్యలు ఏర్పడుతున్నాయి. రైలు ప్రయాణాల వల్ల ప్రయాణికులకు కరోనా సోకకూడదనే ఉద్దేశంతో కొన్ని నెలల క్రితం కేంద్రం రైలు ప్రయాణం చేసేవాళ్లు గంటన్నర ముందే రైల్వే స్టేషన్ కు చేరుకోవాలని సూచించింది.

    ఈ నిబంధన వల్ల రైలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. రైల్వే స్టేషన్లలో ప్రతి ఒక్కరినీ థర్మల్ స్క్రీనింగ్ ద్వారా చెక్ చేసి పంపించడం కోసం ఈ నిబంధనను అమలు చేయగా ఈ నిబంధన వల్ల ప్రయాణికులు సమయం వృథా అవుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకోవడంతో పాటు రైలు ప్రయాణికులకు ప్రయోజనం కలిగేలా చేసింది.

    ప్రయాణికుల శరీర ఉష్ణోగ్రతను ఆటోమేటిక్ గా మెజర్ చేసే ఆధునిక థర్మల్‌ స్క్రీనింగ్‌ లు దేశంలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని కాచిగూడ, సికింద్రాబాద్ లాంటి ప్రధాన రైల్వే స్టేషన్లలో సైతం ఆధునిక థర్మల్ స్క్రీనింగ్ లను ఏర్పాటు చేశారు. ఫలితంగా గతంలో అమలు చేసిన గంటన్నర ముందుగానే రావాలనే నిబంధనను తొలగించారు.

    దక్షిణ మధ్య రైల్వే అధికారులు రైళ్లలో ప్రయాణించాలనుకునే ప్రయాణికులు గతంలోలా అరగంట ముందు వచ్చినా సరిపోతుందని చెప్పారు. ప్రయాణికులను మాత్రమే రైల్వే స్టేషన్లలోకి అనుమతిస్తామని.. వారి సహాయకులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని తెలిపారు. ఎక్కువ సామాగ్రితో ప్రయాణించే వారు ముందుగానే వచ్చి రైల్వే కూలీల సహాయం పొందవచ్చని వెల్లడించారు.