https://oktelugu.com/

లాయర్ దంపతులది ప్రభుత్వ హత్య: వామన్ రావు కుటుంబాన్ని పరామర్శించిన ఉత్తమ్

తెలంగాణలోని పెద్ద పల్లి జిల్లాలో పట్టపగలు నడిరోడ్డు మీద హైకోర్టు న్యాయవాద దంపతుల హత్య తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. శనివారం పెద్దపల్లి జిల్లా గుంజపడుగులో వామన్ రావు కుటుంబ సభ్యులను పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, డిసిసి అధ్యక్షులు కొమురయ్య, లక్ష్మణ్, ప్రకాష్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు కలిశారు. వామన్ రావు తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా పీసీసీ […]

Written By:
  • NARESH
  • , Updated On : February 27, 2021 / 05:41 PM IST
    Follow us on

    తెలంగాణలోని పెద్ద పల్లి జిల్లాలో పట్టపగలు నడిరోడ్డు మీద హైకోర్టు న్యాయవాద దంపతుల హత్య తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. శనివారం పెద్దపల్లి జిల్లా గుంజపడుగులో వామన్ రావు కుటుంబ సభ్యులను పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, డిసిసి అధ్యక్షులు కొమురయ్య, లక్ష్మణ్, ప్రకాష్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు కలిశారు. వామన్ రావు తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యులను పరామర్శించారు.

    ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ పై పడి వామన్ రావు తండ్రి భోరున విలిపించడం అందరినీ కలిచివేసింది. అనంతరం మాట్లాడిన ఉత్తమ్ ప్రభుత్వం తీరుపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని.. పోలీసులు టీఆర్ఎస్ పార్టీకి ఏజెంట్లుగా మారిపోయారని ఆరోపించారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

    వామన్ రావు కేసును సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని.. దీన్ని కోర్టు పర్యవేక్షించాలని కాంగ్రెస్ పార్టీ తరుఫున డిమాండ్ చేస్తున్నట్టు పీసీసీ చీఫ్ ఉత్తమ్ ప్రకటించారు. ఈ హత్యను సీఎం ఖండించకపోవడం.. ఈ విషయంలో త్వరగా న్యాయం జరగకపోవడం దురదృష్టకరమని ఆయన ఆరోపించారు.

    స్థానిక పోలీసుల దర్యాప్తుపై తనకు నమ్మకం లేదని వామన్ రావు తండ్రి కిషన్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.