
కర్నూలు జిల్లా జి. సింగవరం నీటిపారుదల శాఖ స్థలంలో సచివాల భవనం నిర్మాణంపై హైకోర్టు సీరియస్ అయింది. భవన నిర్మాణాన్ని ఆపేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. భవన నిర్మాణంపై సర్పంచ్ నాగేంద్ర హైకోర్టును ఆశ్రయించారు. గ్రామంలో నిర్మించాలని అడిగినా ఊరికి దూరంగా సచివాలయం కట్టడంపై పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. భవన నిర్మాణం కోసం కాంట్రాక్టర్ కు రూ. 9 లక్షలు చెల్లించాలని సర్పంచ్ కి పంచాయతీ కార్యదర్శి నోటీసులపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శి సర్పంచ్ కి నోటీసులు ఎలా ఇస్తారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.