https://oktelugu.com/

హింస ఎఫెక్ట్: చీలిపోయిన రైతు సంఘాలు

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని తాజాగా రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతకు హింసకు దారితీసింది. ఏకంగా ప్రతిష్టాత్మక ఎర్రకోటపైకి దండెత్తిన రైతులు రచ్చ రచ్చ చేశాడు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని షేక్ చేశారు. రైతుల ర్యాలీ తీవ్ర హింసాత్మకంగా మారింది. పలువురికి గాయాలయ్యాయి. పోలీసులపై దాడులు జరిగాయి. ఈక్రమంలోనే దీనిపై వెల్లువెత్తుతున్న విమర్శలకు నిరసనలు తెలుపుతున్న రైతుల్లో చీలిక వచ్చింది. తాజాగా రైతు నిరసనల నుంచి రెండు […]

Written By:
  • NARESH
  • , Updated On : January 27, 2021 / 06:37 PM IST
    Follow us on

    కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని తాజాగా రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతకు హింసకు దారితీసింది. ఏకంగా ప్రతిష్టాత్మక ఎర్రకోటపైకి దండెత్తిన రైతులు రచ్చ రచ్చ చేశాడు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని షేక్ చేశారు.

    రైతుల ర్యాలీ తీవ్ర హింసాత్మకంగా మారింది. పలువురికి గాయాలయ్యాయి. పోలీసులపై దాడులు జరిగాయి. ఈక్రమంలోనే దీనిపై వెల్లువెత్తుతున్న విమర్శలకు నిరసనలు తెలుపుతున్న రైతుల్లో చీలిక వచ్చింది.

    తాజాగా రైతు నిరసనల నుంచి రెండు కీలక సంఘాలు వైదొలగడడం రైతు సంఘాలకు తీవ్ర ఎదురుదెబ్బగా పరిణమించింది. ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కమిటీ (ఏఐకేఎస్సీసీ), భారతీయ కిసాన్ యూనియన్ (భాను) సంఘాలు హింసాత్మకంగా మారిన నిరసనను ఖండించాయి. ఈ క్రమంలోనే రైతు చట్టాలకు వ్యతిరేకంగా సాగిస్తున్న రైతు ఆందోళనల నుంచి తాము వైదొలుగుతున్నట్లు ఆ రెండు యూనియర్లు బుధవారం సంచలన ప్రకటన చేశాయి.

    రైతుల ఆందోళన హింసాత్మకంగా మారుతోందని.. ఎవరికి తోచినట్టు వారు చేస్తున్నారని.. ఇలాంటివి తమ సంఘానికి పడవంటూ కిసాన్ సంఘర్ష్ కమిటీ తక్షణం ఆందోళన నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించింది. కొందరు చేసిన పని వల్ల అందరు రైతులకు, రైతు సంఘాలకు చెడ్డ పేరు వస్తోందన్నారు. బుధవారం హింసకు తము బాధ్యత లేదని చెప్పుకొచ్చాయి.

    కాగా రైతుల హింసాత్మక చర్యల నేపథ్యంలో 200 మంది రైతు నేతలపై ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేశారు. వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ క్రమంలోనే రైతు సంఘాల్లో చీలిక వచ్చింది.