Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నిన్న విడుదలైన టైటిల్ సాంగ్ పై వివాదం రాజుకుంది. ఈపాట పవన్ ఫ్యాన్స్ ను ఖుషీ చేయగా.. తెలంగాణ పోలీసులు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పాట విడుదలైన 22 గంటల్లోనే 8 మిలియన్లకు పైగా వ్యూస్ తో యూట్యూబ్ లో ట్రెండింగ్ నంబర్ 1 గా ఉంది.
‘భీమ్లా నాయక్’ అంటూ సాగే ఈ పాటలో జానపద గాయకుడు, కిన్నెర మెట్ల వాయిద్యకారుడు దర్శనం మొగిలియ్య పాడిన మొదటి చరణాలు పాటకే హైలెట్ గా చెప్పొచ్చు. మధ్యలో మరో ప్రముఖ సింగర్ రామ్ మిరియాల గానం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
అయితే ఈ పాటపై తెలంగాణ పోలీసుల నుంచి అభ్యంతరం వ్యక్తమవుతోంది. హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ, ఐపీఎస్ రమేశ్ భీమ్లా నాయక్ పాటలోని లిరిక్స్ పై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ఈ పాటపై స్పందించారు.
‘తెలంగాణ పోలీసులు పీపుల్ ఫ్రెండ్లీ.. మేము ఎవరి రక్షణ కోసమైతే తాము జీతాలు తీసుకుంటున్నామో.. వారి బొక్కలు తాము విరగ్గొట్టం.. గేయ రచయిత రామజోగయ్య శాస్త్రికి పోలీసుల ఛరిష్మాను వర్ణించేందుకు ఇంతకుమించిన పదాలు దొరక్కపోవడం ఆశ్చర్యకరం. పోలీసుల సేవలు ఇందులో ఎక్కడ పేర్కొనలేదు’ అని ఐపీఎస్ రమేశ్ భీమ్లా నాయక్ పాటపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఈ వివాదం రాజుకుంది.
భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ లో ‘చెమడాలొలిచే లెక్క కొట్టాడంటే పక్కా విరుగును బొక్క’..ఎర్రి గంతులేస్తే ఇరిగిపోద్ది ఎన్నుపూస’ అంటూ పోలీసుల ప్రతాపం వర్ణించే విషయంలో రైటర్ రామజోగయ్య కాస్త అతిగా పదాలు వాడినట్టుగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
పోలీసులంటే కుమ్మడం, బొక్కలు విరగ్గొట్టేడమే కాదు అని ఐపీఎస్ రమేశ్ భీమ్లా నాయక్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల సేవా గుణాన్ని పాటలో పేర్కొనకపోవడాన్ని ఆయన ప్రస్తావించారు.
తెలంగాణ పోలీసుల నుంచి వచ్చిన ఈ అభ్యంతరాలపై ఇప్పటివరకూ భీమ్లా నాయక్ టీం స్పందించలేదు.
మలయాళంలో హిట్ అయిన ‘అయ్యప్పమ్ కోషియమ్’ మూవీ రిమేక్ గా ‘భీమ్లా నాయక్’ తెలుగులో రూపొందుతోంది. పవన్ కళ్యాణ్, రానా కీలక పాత్రలు పోషించగా.. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. దిగ్గజ రైటర్ త్రివిక్రమ్ ఈ సినిమాకు మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు.
Thankfully, @TelanganaCOPs are #PeopleFriendlyPolice . We don’t break the bones of those whom we are paid to protect ! Surprisingly, @ramjowrites couldn’t find enough words in Telugu to describe the valour of a cop. No mention of service in the song. https://t.co/EsQVaW5p2s
— Ramesh Masthipuram IPS (@MRAMESHIPS) September 2, 2021
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Telangana ips officer objection over pawan kalyan bheemla nayaks title song lyrics
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com