మిల్కీ బ్యూటీ తమన్నా సీనిరంగానికి వచ్చి ఇటీవల 15ఏళ్లు పూర్తి చేసుకుంది. తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో తమన్నా నటించి మెప్పింది. తమన్నాకు కుర్రకారులో భారీ క్రేజీ ఉంది. ఆమె గ్లామర్, నటన, డాన్సులకు యువత పిచ్చెక్కిపోతున్నారు. తెరపై తమన్నా కనిపిస్తే చాలు కళ్లర్పకుండా చూస్తుండిపోతున్నారు. హీరోలకు ధీటుగా తమన్నా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకుంది. ఈ 15ఏళ్ల కెరీర్లో ఎన్నో మరుపురాని హిట్లను మిల్కి బ్యూటీ తన ఖాతాలో వేసుకుంది.
వెండితెరపై అగ్రకథానాయికగా కొనసాగిన తమన్నాకు పెళ్లిపై గాలిమళ్లినట్టుంది. తమన్నా పెళ్లిపై ఆమె తల్లి ఇటీవల హింట్ కూడా ఇచ్చారు. తమన్నాకు సంబంధాలు చూస్తున్నామని వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన తమన్నా తన పెళ్లిపై మాట్లాడింది. ‘ఒకవేళ మీకు స్వయంవరం పెడితే.. దానికి ఏ హీరోలు రావాలని కోరుకుంటారు?` అని అడిగిన వెంటనే తమన్నా స్పందించింది.
తన స్వయంవరానికి ‘బహుబలి’ ప్రభాస్, హృతిక్ రోషన్, విక్కీకౌశల్ రావాలని కోరుకుంటానని చెప్పింది. మంచి అబ్బాయి దొరికితే వెంటనే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఇక బాలీవుడ్ హీరో హృతిక్‌కు తమన్నా వీరాభిమాని. ఇక ప్రభాస్‌తో తమన్నా పలు సినిమాల్లో నటించింది. ఈ ముగ్గురిలో ప్రభాస్, విక్కీ కౌశల్ కు వివాహం జరుగలేదు. ప్రభాస్ తో తమన్నా ‘రెబల్’, ‘బహుబలి’ మూవీల్లో నటించింది. వీరిద్దరి జోడి తెరపై ఆకట్టుకుంది. తమన్నా తన మనసులోని మాటను వెల్లడించింది. దీనిపై ప్రభాస్ స్పందిస్తాడో లేదో చూడాలి.