https://oktelugu.com/

రైతు ఉద్యమానికి మద్దతు తెలిపి రూ.కోటి విరాళం ప్రకటించిన ప్రముఖ సింగర్..!

కేంద్రం ప్రభుత్వం ఇటీవల వ్యవసాయ సంస్కరణ పేరిట తీసుకొచ్చిన మూడు బిల్లులను రద్దు చేయాలని రైతులు గత కొద్దిరోజులుగా ఢిల్లీలో నిరసనలు తెలుపున్నారు. పంజాబ్.. యూపీ.. హర్యానా రైతులు ఢిల్లీలో గడిచిన పది రోజులుగా కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు. ఈక్రమంలోనే కేంద్రం రైతులతో పలుమార్లు చర్చించినా ఫలితం మాత్రం రాలేదు. Also Read: రైతు ఉద్యమానికి పెరుగుతున్న మద్దతు.. పునరాలోచనలో కేంద్రం..! కేంద్రం, రైతుల మధ్య పలుమార్లు చర్చలు కొలిక్కి రాకపోవడంతో రైతు సంఘాల నాయకులు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 6, 2020 / 07:23 PM IST
    Follow us on


    కేంద్రం ప్రభుత్వం ఇటీవల వ్యవసాయ సంస్కరణ పేరిట తీసుకొచ్చిన మూడు బిల్లులను రద్దు చేయాలని రైతులు గత కొద్దిరోజులుగా ఢిల్లీలో నిరసనలు తెలుపున్నారు. పంజాబ్.. యూపీ.. హర్యానా రైతులు ఢిల్లీలో గడిచిన పది రోజులుగా కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు. ఈక్రమంలోనే కేంద్రం రైతులతో పలుమార్లు చర్చించినా ఫలితం మాత్రం రాలేదు.

    Also Read: రైతు ఉద్యమానికి పెరుగుతున్న మద్దతు.. పునరాలోచనలో కేంద్రం..!

    కేంద్రం, రైతుల మధ్య పలుమార్లు చర్చలు కొలిక్కి రాకపోవడంతో రైతు సంఘాల నాయకులు ఈనెల 8న భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ బంద్ కు ఇప్పటికే కాంగ్రెస్.. టీఆర్ఎస్.. ఆర్జేడీ, శిరోమ‌ణి అకాలీద‌ళ్‌.. శివ‌సేన‌.. తృణ‌మూల్ కాంగ్రెస్.. డీఎంకే పార్టీలు మ‌ద్ద‌తు తెలిపాయి. అదేవిధంగా ప‌లువురు సినీ.. క్రీడా.. రాజకీయ ప్రముఖులు వ్యక్తిగతంగా మద్దతు ప్రకటిస్తున్నారు.

    రైతులు కేంద్రానికి వ్యతిరేకంగా చేపడుతున్న ఉద్యమానికి ప్రముఖ నటుడు, సింగర్ దిల్జిజ్ దోసంజ్ కోటి రూపాయాల విరాళం ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. దేశంలో ఏదైనా విపత్తు సంభవించినపుడు సెలబ్రెటీలు విరాళాలు ప్రకటించడం చాలాసార్లు చూశాం. అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపడుతున్న ఓ ఉద్యమానికి మద్దతుగా ఇప్పటివరకు ఏ సెలబ్రెటీ కూడా విరాళాలు ఇచ్చిన దాఖలాలులేవు.

    Also Read: వ్రతం చెడ్డా పవన్ కు ఫలితం దక్కలేదా?

    ఇందుకు భిన్నంగా ప్రముఖ సింగర్ దిల్జిజ్ దోసంజ్ రైతు ఉద్యమానికి మద్దతు ప్రకటించడమే కాకుండా కోటి విరాళం ప్రకటించారు. ఢిల్లీలోని తీవ్రమైన చలిలో రైతులు రోడ్లపై పది రోజులుగా చేస్తున్న నిరసనకు ఆయన చలించిపోయారు. దీంతో రైతులందరికీ దుప్పట్లు.. స్వైటర్లు అందించేందుకు దిల్జిజ్ దోసంజ్ కోటి విరాళం ప్రకటించినట్లు తెలుస్తోంది. కేంద్రంపై రైతులు శాంతియుతంగా పోెరాటం సాగించి సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్