https://oktelugu.com/

సంచలనం: బీజేపీ నిర్ణయాన్ని వ్యతిరేకించిన జనసేన

పాలు నీళ్లలా కలిసిపోవాల్సిన బీజేపీ-జనసేనలు ఇప్పుడు పరస్పర విరుద్ధంగా పోతున్నాయి. ఒక్క నిర్ణయం ఇరు పార్టీల మధ్య చిచ్చు పెట్టేలా ఉంది.కమ్యూనిస్టు భావాలున్న జనసేనాని పవన్ కళ్యాణ్.. తనకు అస్సలు పడని హిందుత్వ బీజేపీతో కలిసినప్పుడే ఈ జోడీ కలుస్తుందా? లేదా అన్న అనుమానాలు అందరిలోనూ కలిశాయి. కానీ అధికారం కోసం ఇరు పార్టీలు రాజీపడ్డ సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు విశాఖ ఉక్కు రెండు పార్టీల విభేదాలకు కారణమైంది. సహజంగానే కార్మిక పక్షపాతి అయిన పవన్ […]

Written By:
  • NARESH
  • , Updated On : February 5, 2021 / 08:49 PM IST
    Follow us on

    పాలు నీళ్లలా కలిసిపోవాల్సిన బీజేపీ-జనసేనలు ఇప్పుడు పరస్పర విరుద్ధంగా పోతున్నాయి. ఒక్క నిర్ణయం ఇరు పార్టీల మధ్య చిచ్చు పెట్టేలా ఉంది.కమ్యూనిస్టు భావాలున్న జనసేనాని పవన్ కళ్యాణ్.. తనకు అస్సలు పడని హిందుత్వ బీజేపీతో కలిసినప్పుడే ఈ జోడీ కలుస్తుందా? లేదా అన్న అనుమానాలు అందరిలోనూ కలిశాయి. కానీ అధికారం కోసం ఇరు పార్టీలు రాజీపడ్డ సంగతి తెలిసిందే.

    అయితే ఇప్పుడు విశాఖ ఉక్కు రెండు పార్టీల విభేదాలకు కారణమైంది. సహజంగానే కార్మిక పక్షపాతి అయిన పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు ప్రైవేటీకరిస్తూ కేంద్రంలోని బీజేపీ చేసిన నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఈ మేరకు జనసేన పార్టీ తరుఫున బీజేపీ నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకించడం విశేషం.

    విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్టు జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించడం సంచలనమైంది.. వైజాగ్ స్టీల్ ప్లాంటును కాపాడుకునేందుకు కృషి చేస్తామని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రైవేటీకరణ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాల్సిందిగా కేంద్రాన్ని కోరుతానని పేర్కొన్నారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డాను కలిసి దీనిపై చర్చిస్తారని నాదెండ్ల మనోహర్ తెలిపారు.

    ఇలా బీజేపీ నిర్ణయాలు ఏపీలో బలపడాలనుకుంటున్న జనసేనకు శరాఘాతంగా మారుతున్నాయి. ప్రైవేటీకరణకు తలుపులు బార్లా తెరిచిన బీజేపీ ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గే సూచనలు లేవు. మరి పవన్ చెబితే బీజేపీ వింటుందా? అంటే డౌటే. అందుకే వ్యతిరేకించడం తప్ప ఇప్పుడు పవన్ ఈ విశాఖ ఉక్కు విషయంలో ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. ఏదో కంటితుడుపుగా అమిత్ షా, జేపీ నడ్డాలను కలిసినా బీజేపీ వెనక్కి తగ్గుతుందన్న అవకాశాలు మాత్రం కనిపించడం లేదు.