కరోనా వైరస్ విజృంభణ, లాక్ డౌన్ వల్ల దేశంలో చాలామంది ఆర్థికపరమైన ఇబ్బందులతో సతమతమవుతున్నారు. బ్యాంకులలో పర్సనల్ లోన్ తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే పర్సనల్ లోన్ కు ఒక్కో బ్యాంకు ఒక్కో తరహా వడ్డీని వసూలు చేస్తోంది. అందువల్ల బ్యాంకు వడ్డీ రేట్ల గురించి సరైన అవగాహనను ఏర్పరచుకోవాలి. కొన్ని అంశాల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. లేదంటే నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
Also Read: రైతులకు అలర్ట్.. ఈ పంటతో ఏడాదికి రూ.20 లక్షల ఆదాయం..?
పర్సనల్ లోన్ తీసుకునే సమయంలో సరైన సమయంలో లోన్ చెల్లించకపోతే పడే పెనాల్టీల భారం గురించి అవగాహన ఏర్పరచుకోవాలి. ఉదాహరణకు 5 లక్షల రూపాయలకు 5 సంవత్సరాల కాలపరిమితి చొప్పున లోన్ తీసుకుంటే బ్యాంక్ ఆఫ్ బరోడా 10.10 శాతం వడ్డీని వసూలు చేస్తోంది. దేశంలో ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పర్సనల్ రుణాలపై ఏకంగా 10.75 శాతం వడ్డీ రేటు వసూలు చేస్తోంది.
Also Read: రిస్క్ లేకుండా డబ్బు రెట్టింపు చేసే ఛాన్స్.. ఎలా అంటే..?
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లో రుణం తీసుకుంటే నెలకు 10,809 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ 5 లక్షల రూపాయలకు 9.6 శాతం వడ్డీ చొప్పున 10,525 రూపాయలు వసూలు చేస్తోంది. యూకో బ్యాంక్ పర్సనల్ లోన్ లపై 10.05 శాతం వడ్డీ వసూలు చేస్తోంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కస్టమర్ల నుంచి 9.55 శాతం వడ్డీ రేటుకు రుణాలను ఇస్తోంది. ఇండియన్ బ్యాంక్ లో పర్సనల్ లోన్ కు వడ్డీ రేటు 9.05 శాతంగా ఉంది.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
పంజాబ్ నేషనల్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.95 శాతం వడ్డీకి రుణాలను ఇస్తున్నాయి. అన్ని బ్యాంకులతో పోలిస్తే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తోంది.