కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాలలో అటల్ పెన్షన్ యోజన స్కీమ్ కూడా ఒకటి కాగా ఎవరైతే ఈ స్కీమ్ లో చేరతారో వాళ్లు ప్రతి నెలా డబ్బులు పొందే అవకాశం అయితే ఉంటుంది. 2015 సంవత్సరం నుంచి ఈ స్కీమ్ అమలులో ఉండగా అసంఘటిత రంగంలోని వాళ్లకు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు.
18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ స్కీమ్ లో సులభంగా చేరే అవకాశం అయితే ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ లేదా పోస్టాఫీస్ అకౌంట్ ను కలిగి ఉండటం ద్వారా ఈ స్కీమ్ కొరకు అర్హత పొందడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. ఎవరైతే ఈ స్కీమ్ లో చేరతారో వాళ్లు ప్రతి నెలా కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అలా చెల్లించడం ద్వారా 60 సంవత్సరాల తర్వాత నెలకు 5,000 రూపాయలు పొందే అవకాశం ఉంటుంది.
ఈ స్కీమ్ లో చేరడం ద్వారా నెలకు కనీసం 1,000 రూపాయల నుంచి పెన్షన్ ను పొందే అవకాశం ఉంటుంది. రోజుకు 7 రూపాయల చొప్పున పొదుపు చేసి నెలకు 210 రూపాయలు చెల్లిస్తే ప్రతి నెలా 5,000 రూపాయలు పెన్షన్ పొందే అవకాశాలు అయితే ఉంటాయి. నెలకు 1,000 రూపాయల పెన్షన్ ను పొందాలని అనుకుంటే 42 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. అలా కాకుండా 84 రూపాయలు చెల్లిస్తే 2,000 రూపాయలు పొందవచ్చు. నెలకు 126 రూపాయలు చెల్లించడం ద్వారా 3,000 రూపాయల పెన్షన్ ను పొందవచ్చు.
నెలకు 168 రూపాయలను చెల్లిస్తే 4,000 రూపాయల పెన్షన్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. వయస్సు పెరిగే కొద్దీ చెల్లించాల్సిన మొత్తం పెరిగే అవకాశం ఉంటుంది. అటల్ పెన్షన్ యోజన స్కీమ్ ద్వారా పెన్షన్ పొందాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ ద్వారా అన్ని విధాలుగా ప్రయోజనం చేకూరుతుంది.