https://oktelugu.com/

స్టార్ హీరోల సినిమాలు పండుగకేనట.. కానీ చిన్న ట్వీస్ట్..!

కరోనా క్రైసిస్.. లాక్డౌన్ టాలీవుడ్ ఇండస్ట్రీని తీవ్రంగా దెబ్బతీసింది. సినిమా షూటింగులన్నీ వాయిదా పడటంతో దర్శక నిర్మాతలు.. స్టార్ హీరోల ప్లాన్స్ అన్ని కూడా తలకిందులయ్యారు. ప్రస్తుతం సినిమా షూటింగులు ప్రారంభమైనప్పటికీ కరోనా ప్రభావం రిలీజు డేట్లపై పడుతోంది. దీంతో సంక్రాంతికి రిలీజు డేట్స్ ప్రకటించిన సినిమాలన్నీ దసరాకు పోస్ట్ పోన్ అవుతున్నట్లు సమాచారం. Also Read: ‘ఆర్ఆర్ఆర్’కు అదనపు హంగులు అందుతున్న జక్కన్న.! ప్రతీ సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలు థియేటర్లలో సందడి చేయడం ఆనవాయితీగా […]

Written By:
  • NARESH
  • , Updated On : November 28, 2020 / 11:05 AM IST
    Follow us on


    కరోనా క్రైసిస్.. లాక్డౌన్ టాలీవుడ్ ఇండస్ట్రీని తీవ్రంగా దెబ్బతీసింది. సినిమా షూటింగులన్నీ వాయిదా పడటంతో దర్శక నిర్మాతలు.. స్టార్ హీరోల ప్లాన్స్ అన్ని కూడా తలకిందులయ్యారు. ప్రస్తుతం సినిమా షూటింగులు ప్రారంభమైనప్పటికీ కరోనా ప్రభావం రిలీజు డేట్లపై పడుతోంది. దీంతో సంక్రాంతికి రిలీజు డేట్స్ ప్రకటించిన సినిమాలన్నీ దసరాకు పోస్ట్ పోన్ అవుతున్నట్లు సమాచారం.

    Also Read: ‘ఆర్ఆర్ఆర్’కు అదనపు హంగులు అందుతున్న జక్కన్న.!

    ప్రతీ సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలు థియేటర్లలో సందడి చేయడం ఆనవాయితీగా వస్తోంది. థియేటర్లు ఇంకా పూర్తిస్థాయిలో తెరుచుకోకపోవడం.. వంద అక్యుపెన్సీకి ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోవడంతో భారీ బడ్జెట్లో నిర్మాణమైన సినిమాలు సంక్రాంతి రేసు బరి నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే దర్శక నిర్మాతలు.. స్టార్ హీరోలు మాత్రం ప్లాన్ బీ అమలు చేస్తున్నారట.

    సంక్రాంతి బరిలో ‘ఆచార్య’.. ‘రాధేశ్యామ్’.. ‘వకీల్ సాబ్’ సినిమాలు ఉన్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. కరోనా ఎఫెక్ట్.. ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ ఆలస్యం ‘ఆచార్య’ రిలీజుపై పడినట్లు కన్పిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇంకా భాగం మిలిగి ఉండటంతో సినిమాను వేసవిలో లేదా దసరాకు రిలీజ్ చేయాలని దర్శకుడు కొరటాల శివ భావిస్తున్నాడని సమాచారం.

    కరోనా అనంతరం విదేశాల్లో షూటింగ్ చేసుకున్న తొలి చిత్రంగా ‘రాధేశ్యామ్’ నిలిచింది. అయితే ఈ మూవీ షూటింగు కోసం మరోసారి విదేశాలకు వెళ్లాల్సి ఉందట. ప్రస్తుతం అక్కడి పరిస్థితులు బాగోలేకపోవడంతో సినిమా ఆలస్యమయ్యేలా కన్పిస్తోంది. దీంతో ఈ మూవీ కూడా సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. భారీ షెడ్యూల్ పెండింగ్ ఉండటంతో ఈ సినిమాను దసరాకు తీసుకురావాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.

    Also Read: విశాల్‌, ఆర్యల భారీ మ‌ల్టీస్టార‌ర్ ‘ఎనిమీ’

    ‘వకీల్ సాబ్’ మూవీ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్టు ప్రొడక్షన్ పనులు చేసుకుంటోంది. ఈ మూవీని సంక్రాంతి రిలీజు చేయాలని భావించిన దిల్ రాజు మాత్రం తాజాగా వేసవిలో రిలీజు చేయాలని భావిస్తున్నాడట. కరోనా పరిస్థితులు పూర్తిగా తగ్గిన తర్వాత సినిమా రిలీజు చేస్తే వసూళ్లు బాగా వస్తాయని నిర్మాతలు భావిస్తున్నారు.

    దీంతో ‘వకీల్ సాబ్’ కూడా సంక్రాంతి రేసు నుంచి తప్పుకుందనే వార్తలు విన్పిస్తోంది. బడా సినిమాలన్నీ పోస్టు పోన్ అవుతుండటంతో ఈసారి సంక్రాంతికి చిన్న సినిమాలే సందడి చేయనున్నాయి. ఏదిఏమైనా స్టార్ హీరోలంతా ప్లాన్ ‘బీ’ లేదా మరీ అవసరమైతే ప్లాన్ ‘సి’ని కూడా అమలు చేసేందుకు సిద్ధపడుతుండటం గమనార్హం.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్