https://oktelugu.com/

సమంత డ్రెస్ ధరెంతో తెలిస్తే.. అవాక్కవాల్సిందే..

సమంత.. పెళ్లి అయ్యాక కూడా తన ఫ్యాషన్ జోరు ఆపడం లేదు. ముందు ఎలాగుందో అలానే ఫ్యాషన్ తో హోయలు ఒలుకుతోంది. ఎక్కడా తగ్గకుండా అందాలను ఆరబోస్తోంది. అయితే తాజాగా అవకాశాలు తగ్గడంతో వెండితెరపైనే కాకుండా డిజిటల్ మీడియాలోను హీరోయిన్ సమంత హవా కొనసాగిస్తుంది. ఇటీవల ఆహా ఓటీటీ వేదికలో సామ్ జామ్ అనే షో నిర్వహించి అందులో మెగా సెలబ్రెటీలను ఇంటర్వ్యూలు చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక తాజాగా ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ అనే […]

Written By:
  • NARESH
  • , Updated On : February 12, 2021 / 07:52 PM IST
    Follow us on

    సమంత.. పెళ్లి అయ్యాక కూడా తన ఫ్యాషన్ జోరు ఆపడం లేదు. ముందు ఎలాగుందో అలానే ఫ్యాషన్ తో హోయలు ఒలుకుతోంది. ఎక్కడా తగ్గకుండా అందాలను ఆరబోస్తోంది. అయితే తాజాగా అవకాశాలు తగ్గడంతో వెండితెరపైనే కాకుండా డిజిటల్ మీడియాలోను హీరోయిన్ సమంత హవా కొనసాగిస్తుంది. ఇటీవల ఆహా ఓటీటీ వేదికలో సామ్ జామ్ అనే షో నిర్వహించి అందులో మెగా సెలబ్రెటీలను ఇంటర్వ్యూలు చేసింది ఈ ముద్దుగుమ్మ.

    ఇక తాజాగా ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ అనే హిందీ వెబ్ సిరీస్‏లో నటిస్తుంది సమంత. ఈ వెబ్ సిరీస్ ద్వారా అటు బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గర కాబోతుంది సామ్. ఇవే కాకుండా టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించనున్న ‘శాకుంతలం’ సినిమాలో నటించనుంది.

    తాజాగా సమంత పసుపు రంగులో గౌను ధరించిన ఒఖ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ ఫొటో నెటిజన్లను అమితంగా ఆకర్షిస్తోంది. పసుపు రంగు డ్రెస్‌ ధరించి చిరునవ్వులు చిందిస్తూ అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంటోంది. చాలా సింపుల్‌గా ఉన్న ఆ డ్రెస్‌ని చూసి కొందరు భలే ఉంది అని కామెంట్‌ చేయగా ఫ్యాషన్‌ ప్రియులు మాత్రం దాని ధరెంతో తెలుసుకునే ప్రయత్నం చేశారు.

    ఈ నేపథ్యంలో సమంత ధరించిన గౌను ధర ఇది అంటూ తెలుగు ఆంగ్ల మీడియాలో గాసిప్పులు బయటకు వచ్చాయి. సమంత డ్రెస్‌ ఖరీదు తెలిస్తే అవునా అని ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే సాధారణంగా అత్యంత ఖరీదైన దుస్తులు ధరించే సెలబ్రిటీ చాలా తక్కువ ధర డ్రెస్‌ ధరించడమే ఇందుకు కారణం. ఇంతకీ ఈ డ్రెస్‌ ఎంతంటే? రూ.1700 మాత్రమేనట.. అంత పెద్ద స్టార్ హీరోయిన్ ఇంత సింపుల్ గౌను వేసుకోవడంతో అబ్బో సమంత గ్రేట్ అంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు.