సలార్ షూటింగ్: సింగరేణిలో ప్రభాస్.. మాస్ ఎంట్రీ.. రాకింగ్ లుక్

టాలీవుడ్ పరిశ్రమలో ఎప్పుడూ తెలంగాణపై.. ఇక్కడి కళాకారులపై వివక్ష ఉండేది. తెలంగాణ ప్రాంతాల్లో ఇప్పటికీ పెద్దగా షూటింగ్ లు జరిపేవారు కాదు. ఇప్పటికీ కూడా తెలంగాణలో అద్భుతమైన ప్రాంతాలు.. అడవులు, ప్రదేశాలున్నా షూటింగ్ లకు రావడానికి తెలుగు సినీ జనాలకు నచ్చదు. అయితే ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితి మారుతోంది. రుద్రమదేవి, అల్లు అర్జున్ ‘పుష్ప’ లాంటి సినిమాలు ఆదిలాబాద్ అడవుల్లో చిత్రీకరణ జరుపుకున్నాయి. హైదరాబాద్ రంగారెడ్డితోపాటు ఆదిలాబాద్ జిల్లాలోనూ చూడముచ్చటైన ప్రకృతి రమణీయ ప్రదేశాలున్నాయి. టాలీవుడ్ దీన్ని […]

Written By: NARESH, Updated On : January 29, 2021 7:09 pm
Follow us on

టాలీవుడ్ పరిశ్రమలో ఎప్పుడూ తెలంగాణపై.. ఇక్కడి కళాకారులపై వివక్ష ఉండేది. తెలంగాణ ప్రాంతాల్లో ఇప్పటికీ పెద్దగా షూటింగ్ లు జరిపేవారు కాదు. ఇప్పటికీ కూడా తెలంగాణలో అద్భుతమైన ప్రాంతాలు.. అడవులు, ప్రదేశాలున్నా షూటింగ్ లకు రావడానికి తెలుగు సినీ జనాలకు నచ్చదు. అయితే ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితి మారుతోంది.

రుద్రమదేవి, అల్లు అర్జున్ ‘పుష్ప’ లాంటి సినిమాలు ఆదిలాబాద్ అడవుల్లో చిత్రీకరణ జరుపుకున్నాయి. హైదరాబాద్ రంగారెడ్డితోపాటు ఆదిలాబాద్ జిల్లాలోనూ చూడముచ్చటైన ప్రకృతి రమణీయ ప్రదేశాలున్నాయి. టాలీవుడ్ దీన్ని గుర్తించాల్సి ఉంది.

అయితే కేజీఎఫ్ తో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తాజాగా ప్రభాస్ తో ‘సలార్’ అనే మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ఇటీవలే ప్రారంభమైంది. తొలి షెడ్యూల్ ను తెలంగాణలోని సింగరేణి ప్రాంతమైన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గోదావరిఖనిలో చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ప్రభాస్ ఇక్కడ సింగరేణి గెస్ట్ హౌస్ లో ఉంటూ సింగరేణి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల ప్రాంతంలో షూటింగ్ లో పాల్గొంటున్నారు. మాస్ మసాలా సినిమా కావడం.. ఇందులో ప్రభాస్ ను ఓ రేంజ్ లో దర్శకుడు చూపించబోతున్నట్టు తెలుస్తోంది.

కేజీఎఫ్ లో బంగారు గనుల కోసం.. వాటిని చేజిక్కించుకోవడం కోసం ఫైట్ జరగగా.. ఈ సారి బొగ్గు గనుల్లో దర్శకుడు షూటింగ్ నిర్వహించడం.. తొలిసారి తెలంగాణలోని సింగరేణి గనులకు రావడం ఆసక్తి రేపుతోంది.

తాజాగా ప్రభాస్ క్యార్ వాన్ నుంచి దిగడం.. షూటింగ్ లో ఠీవీగా నిలబడ్డ సీన్లు వీడియోలు ఎవరో తీసి షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. వీటిని ప్రభాస్ ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. సింగరేణిలో ప్రభాస్ మాస్ ఎంట్రీ, రాకింగ్ లుక్ అంటూ తెగ షేర్లు చేస్తున్నారు.