క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నుంచి విడుదలైన మొదటి పాటకు అన్ని భాషల్లో మంచి ఆదరణ దక్కింది. మొత్తానికి పాట ఏవరేజ్ గా ఉన్నా సూపర్ హిట్టైంది. “దోస్తీ” పేరుతో తెలుగుతో పాటు కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో కూడా ముందే ఉహిచినట్టు వైరల్ అయింది. ఈ పాట హిట్ కావడంతో ఈ మల్టీస్టారర్ పై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి.
నిజానికి రాజమౌళి – కీరవాణి కాంబినేషన్ లో వచ్చే పాటలకు మొదటి నుండి ఉండే క్రేజ్ వేరు, కాకపోతే మిగతా భాషల్లో వీరి కలయికకి ఎలాంటి అంచనాలు లేవు. అందుకే ప్రతి భాష నుండి ఆ బాషలోని టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ను లేదా టాప్ సింగర్ ను దించారు. పైగా ఆర్ఆర్ఆర్ నుండి వచ్చిన ఫస్ట్ సాంగ్ కూడా. మొత్తమ్మీద యూట్యూబ్ లో తెగ ట్రెండింగ్ అవుతోంది ఈ పాట.
ఇక ఈ భారీ సినిమా ఆడియో రైట్స్ ను కొనుక్కున్న టీ సిరీస్ కి బాగానే గిట్టుబాటు అయ్యేలా ఉంది. టీ సిరీస్ ఈ సినిమా సాంగ్స్ కోసం దాదాపు 25 కోట్లు ఖర్చు పెట్టారని తెలుస్తోంది. ఇక ఎలక్ట్రానిక్ సహా శాటిలైట్ మరియు డిజిటల్ హక్కులను కూడా ‘పెన్ స్టూడియోస్’ వారు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పై ఆరంభం నుండి ఇండియా వైడ్ గా బజ్ ఉంది.
మరి దాదాపు నాలుగు వందల కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ ప్యాన్ ఇండియా మూవీలో అజయ్ దేవగన్, సముద్రఖని, శ్రీయా అలాగే విదేశీ నటీనటులు కూడా నటిస్తున్నారు కాబట్టి, అలాగే ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా మొదటిసారి కలిసి నటిస్తున్నారు కాబట్టి.. ఆ మాత్రం బజ్ ఉండటం కామన్ అనుకోవాలి. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.