
సోషల్ మీడియా వచ్చిన తర్వాత తమ టాలెంట్ ను నేరుగా జనాల్లోకి పంపించే ఛాన్స్ దొరికింది అందరికీ. దీంతో.. ఎవరికి వారు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కేవలం సోషల్ మీడియా ద్వారానే సక్సెస్ అయిన వారు ఉన్నారు. ఈ ప్లాట్ ఫామ్ ను చక్కగా ఉపయోగించుకుని, కెరీర్ బిల్డ్ చేసుకున్నవారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు అషూ రెడ్డి.
డబ్ స్మాష్ వీడియోల హవా సాగిన సమయంలో ఈ భామ చేసిన హల్ చల్ మామూలుగా లేదు. ముఖ్యంగా సమంత వీడియోలను డబ్ స్మాష్ చేస్తూ ఓ రేంజ్ లో పాపులరిటీ సంపాదించింది. దీంతో.. ఈ బ్యూటీని జూనియర్ సమంత అనే ట్యాగ్ కూడా వరించింది. ఇక, ఈ అమ్మడికి ఫుల్ హైప్ తెచ్చిన మరో అంశం పవర్ స్టార్ ఫ్యాన్ బేస్. తాను పవన్ కు వీరాభిమాని అని చెప్పిన అషూ.. ఇన్ సైడ్ టాటూ కూడా వేయించుకుంది. ఈ విధంగా ఫుల్ ఫేమస్ అయిన ఈ బ్యూటీ హీరో నితిన్ ‘ఛల్ మోహన రంగ’ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించింది.
ఆ తర్వాత.. బిగ్ బాస్ -3 షోలో ఎంట్రీ ఇచ్చి రచ్చ చేసింది. ఈ క్రమంలోనే బిగ్ బాస్-3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో వ్యవహారం నడిపించిందనే గుసగుసలు వినిపించాయి. ఆ మధ్య రాహుల్ అషూరెడ్డిని ఎత్తుకున్న ఫొటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. దీంతో.. వీళ్ల మధ్య మ్యాటర్ పరిగెడుతోందని అనుకున్నారు. అయితే.. ఆ మధ్య రాహుల్ ఓ ఇంటర్వ్యూలో వీళ్ల రిలేషన్ పై ఓపెన్ అయ్యాడు. అషూ తనకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాడు.
ఈ విధంగా ఫేమస్ అయిన అషూ.. ప్రస్తుతం యాంకర్ రవితో కలిసి ప్రముఖ ఛానల్ లో ‘హ్యాపీ డేస్’ అనే షోకు యాంకరింగ్ చేస్తోంది. ఈ షోలో హాట్ డ్రెస్సులతో, డైలాగ్స్ తో రచ్చ చేస్తోంది అషూ. షోకు వచ్చే పార్టిసిపెంట్లతోపాటు ఆడియన్స్ ను కూడా ఓ రేంజ్ లో ఆడుకుంటోంది. ఈ విధంగా.. హ్యాపీ డేస్ షోకు ఫుల్ గ్లామర్ అద్దుతూ.. సక్సెస్ ఫుల్ గా రన్ కావడంలో తన వంతు పాత్ర పోషిస్తోంది.
అయితే.. ఇప్పటి వరకు వచ్చిన ఫేమ్ సరిపోదని భావించిందో.. ఆర్జీవీ చేతిలో పడితే ఎక్కడికో వెళ్లిపోవచ్చని అనుకుందో కానీ.. రామ్ గోపాల్ వర్మను కలిసింది అషూ. ఈ మధ్య బిగ్ బాస్ బ్యూటీ అరియానా – ఆర్జీవీ చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ ఎంతగా పాపులర్ అయ్యిందో తెలిసిందే. దీంతో.. ఆ పాపులారిటీ తనకు కూడా కావాలని ఆర్జీవీతో ఇంటర్వ్యూ ప్లాన్ చేసింది అషూ. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు చేసిందీ బ్యూటీ.
ఇందులో ఆమె చేసిన ఎక్స్ పోజింగ్, వేసుకున్న దుస్తులు చూసి నెటిజన్లు మండిపడుతున్నారు. ఆర్జీవీ స్మార్ట్ ఫోన్ తో అషూరెడ్డిని బాటమ్ నుంచి షూట్ చేస్తున్న తీరును చూసి బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఆర్జీవీకి ఎప్పుడూ ఇదే గోల.. నీకేమైందీ? అంటూ అషూను తిట్టిపోస్తున్నారు. దీనికి అషూ థాంక్యూ అంటూ రిప్లే ఇస్తోంది. అవును మరి.. వారికి కావాల్సిందే ఇదే కదా. జనాల్లో చర్చ జరగాలి.. అది రచ్చ కావాలి.. ఫైనల్ గా ఫేమస్ అయిపోవాలి. చూస్తుంటే.. లక్ష్యం నెరవేరినట్టుగానే కనిపిస్తోంది.
https://www.instagram.com/p/CStes8nj4mB/