
తెలుగు నాట పవర్ స్టార్ స్టామినా ఏంటో ‘వకీల్ సాబ్’ ట్రైలర్ చూపించింది. ఒక్కరోజులే మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధ్యమైంది. ఎవ్వరూ ఊహించని రీతిలో ట్రైలర్ విధ్వంసం వెండితెరపై కనిపించింది. పవన్ ఫ్యాన్స్ ఇప్పటికీ ఊగిపోతున్నారు. ప్రస్తుతం ఇదే యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారి రికార్డులు బద్దలు కొడుతోంది.
పవన్ ‘వకీల్ సాబ్’ ట్రైలర్ పై చిరంజీవి, మహేష్, ఎన్టీఆర్ నుంచి అందరూ చూసి పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు చెబుతున్నారు. పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సినిమా రిలీజ్ కు మించిపోయేలా ట్రైలర్ ను థియేటర్లో విడుదల చేసి రచ్చ చేశారు. ఈ సమయంలో పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ ఈ ట్రైలర్ గురించి ఆసక్తికర కామెంట్ చేశారు ఆయన మాజీ భార్య. పవన్ తో చాలా రోజులు కాపురం చేసి ఇద్దరు పిల్లలను కని ఆయన నుంచి విడాకులు తీసుకొని వేరే పెళ్లి చేసుకున్న రేణుదేశాయ్ తాజాగా ‘వకీల్ సాబ్’ ట్రైలర్ పై స్పందించారు. పవన్ ట్రైలర్ గురించి తాజాగా రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
‘వకీల్ సాబ్’ ట్రైలర్ ను చూసిన రేణు దేశాయ్ హాట్ కామెంట్స్ చేశాడు. ‘పవన్ కళ్యాణ్ ఇందులో కొత్తగా కనిపించాడు. ముఖ్యంగా అమ్మాయిల తరుపున ఆయన న్యాయవాదిగా కనిపించడం నాకెంతో నచ్చింది. చివర్లో పురుషుడిని నువ్ వర్జినా’ అని అడగడం కొత్తగా అనిపించిందని రేణు దేశాయ్ అన్నది.. ట్రైలర్ మొదటి నుంచి చివరి వరకు ఆకట్టుకునేలా ఉందని.. ట్రైలర్ చూస్తుంటే సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నామని తెలిపారు. సినిమాల్లో పవన్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదనడానికి ఈ సినిమా ఉదాహరణగా నిలుస్తుందని రేణుదేశాయ్ చెప్పుకొచ్చింది.
ఇక ఈ ట్రైలర్ లో హీరోయిన్ శృతి హాసన్ పాత్ర ఎక్కడా చూపించకపోవడం గమనార్హం. ఆమె ఓన్లీ ప్లాష్ బ్యాక్ లోనే కనిపించే అవకాశాలున్నాయని.. దాన్ని సీక్రెట్ గా దాచేశారని అంటున్నారు. హిందీ పింక్ సినిమాకు రీమేక్ అయిన ‘వకీల్ సాబ్’ లో దర్శకుడు వేణు శ్రీరామ్ చాలా మార్పులు చేశారని అంటున్నారు. తెలుగు నేటీవిటీగా తగ్గట్టుగా సినిమాలో మార్పులు చేశారని అంటున్నారు.