https://oktelugu.com/

కోరికలు ఎక్కువైతే.. రమ్యకృష్ణ బోల్డ్ కాన్సెప్ట్ !

కుర్ర హీరోయిన్లలో అందాలను దాచుకోకుండా ప్రదర్శించే సుందరాంగులు చాలామందే ఉన్నారు. కానీ, వయసు ముదిరిన అందగత్తెలు ఇంకా అందాల ఆరబోత పై ఆసక్తి చూపించడం నిజంగా విశేషమే. ఎలాగూ ముదురు అందాలను ఆస్వాదించే కళాత్మక హృదయులకు కూడా ఈ ప్రపంచంలో కొదవేమి లేదులేండి. లేకపోతే ‘మలైకా అరోరా’ లాంటి ముదురు భామలకు ఇంకా డిమాండ్ ఎందుకు ఉంటుంది ? అయితే నటిగా తనకంటూ ప్రత్యేక స్థాయిని ఏర్పాటు చేసుకుని.. మోస్ట్ గ్లామరస్ బ్యూటీగా ఒకప్పటి కుర్రకారుకు కలల […]

Written By:
  • admin
  • , Updated On : April 27, 2021 / 04:56 PM IST
    Follow us on

    కుర్ర హీరోయిన్లలో అందాలను దాచుకోకుండా ప్రదర్శించే సుందరాంగులు చాలామందే ఉన్నారు. కానీ, వయసు ముదిరిన అందగత్తెలు ఇంకా అందాల ఆరబోత పై ఆసక్తి చూపించడం నిజంగా విశేషమే. ఎలాగూ ముదురు అందాలను ఆస్వాదించే కళాత్మక హృదయులకు కూడా ఈ ప్రపంచంలో కొదవేమి లేదులేండి. లేకపోతే ‘మలైకా అరోరా’ లాంటి ముదురు భామలకు ఇంకా డిమాండ్ ఎందుకు ఉంటుంది ?

    అయితే నటిగా తనకంటూ ప్రత్యేక స్థాయిని ఏర్పాటు చేసుకుని.. మోస్ట్ గ్లామరస్ బ్యూటీగా ఒకప్పటి కుర్రకారుకు కలల హాట్ హీరోయిన్ గా వారి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాధించుకుంది ‘సీనియర్ స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ’. ఏభై ఏళ్ల వయసులో కూడా సినిమాలతో పాటు వెబ్ సిరీస్ ల్లోనూ నటిస్తూ ముందుకు పోతుంది రమ్యకృష్ణ. అన్నిటికి మించి బాహుబ‌లిలో శివ‌గామి పాత్ర‌తో అన్ని ర‌కాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుని తనకు తానే సాటి అనిపించుకుంది రమ్యకృష్ణ.

    మొత్తమ్మీద అన్ని రకాల పాత్ర‌లకు పూర్తిస్థాయిలో న్యాయం చేయడంలో ఈ సీనియర్ హీరోయిన్ ఆరితేరిపోయింది. పైగా ఈ వయసులో కూడా డైరెక్టర్లు కోరాలే గానీ, ఎక్స్ పోజింగ్ చేయడానికి ర‌మ్య‌కృష్ణ‌ అసలు మొహమాటపడేలా కనిపించడం లేదు. తాజాగా ఓ తమిళ సినిమాలో ఒక బోల్డ్ క్యారెక్టర్ చేయడానికి రమ్యకృష్ణ అంగీకరించింది. వయసు అయిపోయిన తరువాత కూడా హార్మన్ల ప్రభావంతో కోరికలు ఎక్కువైతే ఏమిటి పరిస్థితి ?

    అప్పటికే భర్త కూడా కాలం చేసి ఉంటే.. మరి అప్పుడు ఆమె ఏమి చేయాలి ? ఏమి చేస్తే తప్పు కాదు ? లాంటి అంశాల పై ఆ సినిమా సాగనుంది. నిజంగా ఇలాంటి బోల్డ్ కాన్సెప్ట్ తో బోల్డ్ పాత్ర చేయడానికి రమ్యకృష్ణ ఒప్పుకోవడం అందర్నీ షాక్ కి గురి చేస్తోంది. బాహుబ‌లిలో శివ‌గామి పాత్ర‌తో సెకెండ్ ఇన్నింగ్స్‌ ను గొప్ప‌గా ప్రారంభించిన ర‌మ్య‌కృష్ణ.. రెట్టింపు పారితోషికం కోసం ఇలా హద్దులు మీరడం నిజంగా ఆశ్చర్యకరమే.