
Ram Charan, Samantha: తెలుగు సినిమా పరిశ్రమలో రంగస్థలం సృష్టించిన సంచలన విజయం తెలిసిందే. కథనంలో దర్శకుడు సుకుమార్ తీసుకున్న శ్రద్ధ ఏమిటో తెలిసిపోతోంది. ప్రేక్షకులను మెప్పించి అందరి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో రాంచరణ్ పాత్ర తీరు అందరిని మెప్పించింది. ఆయన నటన కూడా ఓ ట్రెండ్ సెట్ చేసింది. చెవిటి వాడి పాత్రలో ఒదిగిపోయారు. అందులో లీనమైపోయాడు. ఇక రాంచరణ్ సమంత ల నటన కూడా ఓ మైలురాయి. ఇక ఈ సినిమాలో రాంచరణ్ సమంతల మధ్య ముద్దు సన్నివేశం కూడా అందరి దృష్టిని ఆకర్షించింది.
దర్శకుడు సుకుమార్ మొదట కథ చెప్పేటప్పుడు ఈ సీన్ గురించి చెప్పలేదట. తరువాత చెప్పినా రాంచరణ్ అందుకు ససేమిరా అనడంతో సుకుమార్ ఆయనను ఒప్పించడానికి నానా తిప్పలు పడినట్లు తెలుస్తోంది. ముద్దు సన్నీవేశం సినిమాను మలుపు తిప్పే విధంగా ఉంటుందని భావించి చివరికి చరణ్ ను ఓకే చెప్పించడానికి నానా తంటాలు పడ్డాడట. సమంత పెదాల దగ్గరకు వస్తే చాలు ఎడిటింగ్ లో సెట్ చేసుకుంటామని చెప్పి ఔననిపించాడు. తన భార్య ఉపాసనకు ముద్దు సీన్ ఉంటే నచ్చదని చెప్పేశాడట. కానీ చివరికి దర్శకుడి కోరికతో సరేనన్నాడట.
సన్నివేశం చిత్రీకరణకు సమాయత్తం అయ్యాక ఒక్కసారి సమంత తన పెదాలతో రాంచరణ్ పెదాలకు తాకించడంతో చరణ్ అవాక్కయ్యాడట. దీంతో సుకుమార్ పై అలిగాడట. తనకు ఇష్టం లేకున్నా ముద్దు సీన్ లో నటించినందుకు ఆగ్రహం వ్యక్తం చేశాడు. కానీ సినిమాకు ఆ సన్నివేశం ఎంత ముఖ్యమో దర్శకుడికి తెలుసు కాబట్టే దానికి ఇద్దరిని ఒప్పించినట్లు తెలుస్తోంది. కానీ సినిమా విజయంలో కీలక పాత్ర వహించిన ముద్దు గురించి అప్పట్లో పెద్ద సంచలనమే అయింది.
తన సినిమాల్లో ఎక్కడ కూడా అలాంటి సీన్ లు ఉండకూడదనే జాగ్రత్త పడుతుంటాడు చరణ్. కానీ ఈ సినిమాకు మాత్రం దానికి ఒప్పుకోక తప్పకపోయే సరికి మనసులోనే బాధ పడినట్లు తెలుస్తోంది. భవిష్యత్ లో ఇలాంటి సన్నివేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కానీ సినిమా విజయంలో కీలక ఘట్టాలను వద్దంటే ఎలా అని దర్శకుడు రాంచరణ్ ను తరువాత దానికి ఒప్పించేందుకు కూడా నానా తంటాలు పడినట్లు తెలుస్తోంది.