బిగ్ బాస్ 3 సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ అవ్వడానికి ప్రధాన కారణం అతడు హౌస్ లో చేసిన ప్రేమాయణాలే.. పునర్నవితో చివరికంటా రాహుల్ చేసిన రోమాన్స్ అతడిని విజేతగా నిలిపింది. అయితే బయటకు వచ్చాక రాహుల్, పునర్నవిలు పెద్దగా ప్రేమలోకంలో విహరించడం లేదు.
Also Read: ఆ హీరోయిన్ మళ్ళీ ప్రేమలో పడిందట !
రాహుల్ తన పని తాను చేసుకుంటుండగా.. పునర్నవి కూడా వేరే వ్యాపకాల్లో బిజీగా మారింది. యాంకర్ గా చేస్తూనే రాహుల్ ఇటీవల ‘ఊకో కాకా’ పేరుతో వస్త్ర వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. తన వ్యాపార దుకాణానికి పెట్టిన పేరు పక్కా తెలంగానం లాగా ఉండడంతో పాపులర్ అయిపోయింది. ఇటీవలే కరీంనగర్ లో షోరూమ్ ను ప్రారంభించగా మంచి స్పందన వచ్చింది.
ఇప్పుడు అదే ఊపులో నేటి సాయంత్రం హైదరాబాద్ లో కూడా కొత్త షాప్ తెరిచేందుకు అన్నీ సిద్ధం చేశాడు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పునర్నవి కాకుండా మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆషూ రెడ్డి రావడం అందరినీ ఆకర్షించింది. రాహుల్ ఏకంగా ఆమెను ఎత్తుకొని రోమాంటిక్ నిలబడి ఫొటోలకు ఫోజులు ఇవ్వడం చూశాక వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్టే కనిపిస్తోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
Also Read: పాపం.. నయనతారకు మళ్ళీ పెళ్లి !
ఇన్ స్టాగ్రామ్ లో ఆషూరెడ్డి గురించి ‘కాకా ఫ్రెండ్ అంటే ఇట్లుండాలే.. ఇప్పుడు నాకింకా ధైర్యం వచ్చింది’ అని రాహుల్ తెలంగాణ యాసలో పేర్కొనడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్