రైతు ఉద్యమాన్ని రగిలించిన రాహుల్ గాంధీ

సాగు చట్టాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సమరశంఖం పూరించాడు. రైతుల ఉద్యమానికి బహిరంగంగా మద్దతు ప్రకటించారు. ఇన్నాళ్లు ఆచితూచి వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ తాజాగా రైతుల ఉద్యమాన్ని రగిలించడానికి డిసైడ్ అయ్యింది. రాహుల్ గాంధీ ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఉద్యమానికి ఊపిరిపోయాలని పిలుపునివ్వడం విశేషంగా మారింది. తాజాగా రాహుల్ గాంధీ ‘ఫార్మర్స్ ప్రొటెస్ట్’ హ్యాష్ ట్యాగ్ తో రైతుల ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ చట్టాలతో రైతులకు మాత్రమే కాకుండా యావత్ దేశానికే […]

Written By: NARESH, Updated On : February 6, 2021 9:30 pm
Follow us on

సాగు చట్టాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సమరశంఖం పూరించాడు. రైతుల ఉద్యమానికి బహిరంగంగా మద్దతు ప్రకటించారు. ఇన్నాళ్లు ఆచితూచి వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ తాజాగా రైతుల ఉద్యమాన్ని రగిలించడానికి డిసైడ్ అయ్యింది. రాహుల్ గాంధీ ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఉద్యమానికి ఊపిరిపోయాలని పిలుపునివ్వడం విశేషంగా మారింది.

తాజాగా రాహుల్ గాంధీ ‘ఫార్మర్స్ ప్రొటెస్ట్’ హ్యాష్ ట్యాగ్ తో రైతుల ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ చట్టాలతో రైతులకు మాత్రమే కాకుండా యావత్ దేశానికే ప్రమాదమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. మూడు వ్యవసాయ చట్టాలతో రైతులకు, కూలీలకు మాత్రమే కాక దేశానికి, ప్రజలందరికీ ప్రమాదమని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అన్నదాతల శాంతియుత సత్యాగ్రహం జాతీయ ప్రయోజనాల కోసం చేస్తున్న ఉద్యమమని రాహుల్ గాంధీ కొనియాడారు.

కాంగ్రెస్ తరుఫున అధికారికంగా రైతుల ఉద్యమానికి మద్దతు ప్రకటించి రాహుల్ ఉద్యమాన్ని రగిలించాడు. ఈ ఉద్యమానికి నెటిజన్లు, ప్రజలు మద్దతుగా నిలువాలని కోరాడు.

కొద్దిరోజులుగా ఢిల్లీ శివార్లలో వ్యవసాయ చట్టాల రద్దు కోసం అలుపెరగకుండా పోరాడుతున్న రైతులకు మద్దతుగా రాహుల్ గాంధీ నిలిచారు. ఇన్నాళ్లు విదేశీ సెలబ్రెటీలు మాత్రమే దీనిపై స్పందించాయి. దేశంలోని రాజకీయ పార్టీలు పెద్దగా స్పందించలేదు. రైతులు పార్టీలను దగ్గరకు రానీయలేదు. అయితే తాజాగా దేశంలోనే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తరుఫున రాహుల్ గాంధీ రైతు ఉద్యమాన్ని రగిలించడం సంచలనమైంది. ఈ చర్య కేంద్రంపై తీవ్ర ఒత్తిడి పెంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.