నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు అరెస్టుతో కుటుంబ సభ్యులు ఢిల్లీ వెళ్లి నాయకులను కలిశారు. రఘురామ అరెస్టు వ్యవహారంపై పట్టించుకోవాలని విన్నపాలు చేసుకున్నారు.
కానీ వారికి భరోసా దక్కలేదని తెలుస్తోంది. దీంతో రఘురామను జైల్లోనే హత్య చేయించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఆయన భార్య రమ, కుమారుడు భరత్ ఎంపీ అరెస్టుపై తమ గళం వినిపించారు. ఈ నేపథ్యంలో వారు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి పరిస్థితిని వివరించినట్లు తెలిసింది. కానీ వారి నుంచి ఏ రకమైన హామీ రాలేదని తెలిసింది.
సుప్రీం ఆదేశాలు బేఖాతరు
రఘురామ అరెస్టు వ్యవహారంలో సుప్రీం కోర్టు ఆదేశాలను సైతం ప్రభుత్వం పట్టించచుకోవడం లేదని భార్య రమాదేవి, కొడుకు భరత్, కుమార్తె ప్రియదర్శిని ఢిల్లీలో తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో రాష్ర్టంలో ఏం జరుగుతోందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నయి. రఘురామను ఆస్పత్రికి పంపించి వైద్య సేవలు అందించాలని చెప్పినా పట్టించుకునే వారే కరువయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ర్ట పరిస్థితిపై రఘురామ కుటుంబ సభ్యులు కేంద్ర మంత్రి అమిత్ షా కు వివరించారు. విచారణ పేరుతో చిత్రహింసలు
రఘురామ కృష్ణంరాజును అరెస్టు చేసిన సీఐడీ పోలీసులు విచారణ పేరుతో చిత్ర హింసలకు గురి చేస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
రఘురామ అరెస్టు ఎందుకు చేయాల్సి వచ్చిందో ఆరా తీస్తామని అమిత్ షా చెప్పినట్లు తెలిసింది. రఘురామ అరెస్టుకు స్పీకర్ అనుమతి ఎందుకు తీసుకోలేదనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. లోక్ సభ సభ్యుడిని అరెస్టు చేసే ముంు స్పీకర్ అనుమతి తప్పనిసరి. కానీ రఘురామ అరెస్టు వ్యవహారంలో స్పీకర్ అనుమతి తీసుకోలేదని తెలిసింది.