https://oktelugu.com/

టీఆర్ఎస్ నేతలే గెలిపించారు.. రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉప ఎన్నికలన్నింటిని ఊదేస్తున్న టీఆర్ఎస్ జైత్రయాత్రకు దుబ్బాకలో చెక్ చెప్పారు రఘునందన్ రావు. ఏకంగా అధికార టీఆర్ఎస్ పార్టీని ఓడించి కాషాయ జెండాను ఎగురవేశారు. ఈ విజయం బీజేపీకి వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చింది. ఇప్పుడు తెలంగాణపై దృష్టిసారించడానికి బీజేపీకి తోడ్పడింది. ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన రఘునందన్ రావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. Also Read: గళగళ మాట్లాడే సుమ.. కేటీఆర్ మాటలకు స్టన్ అయిపోయింది.. ఎందుకు? […]

Written By: , Updated On : November 21, 2020 / 05:13 PM IST
Follow us on

BJP MLA Raghunandan Rao

తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉప ఎన్నికలన్నింటిని ఊదేస్తున్న టీఆర్ఎస్ జైత్రయాత్రకు దుబ్బాకలో చెక్ చెప్పారు రఘునందన్ రావు. ఏకంగా అధికార టీఆర్ఎస్ పార్టీని ఓడించి కాషాయ జెండాను ఎగురవేశారు. ఈ విజయం బీజేపీకి వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చింది. ఇప్పుడు తెలంగాణపై దృష్టిసారించడానికి బీజేపీకి తోడ్పడింది. ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన రఘునందన్ రావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read: గళగళ మాట్లాడే సుమ.. కేటీఆర్ మాటలకు స్టన్ అయిపోయింది.. ఎందుకు?

దుబ్బాకలో తనను గెలిపించింది టీఆర్ఎస్ నేతలే అని రఘునందన్ రావు హాట్ కామెంట్స్ చేశారు..ఇక తనను టీఆర్ఎస్ నుంచి ఎందుకు బయటకి పంపించారో ఇప్పటికీ సమాధానం లేదని రఘునందన్ రావు అన్నారు. ఇక సమాధానం వస్తుందని అనుకోవడం లేదు అని తెలిపారు. మాతోపాటు ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్న రఘునందన్ రావుకు ఓటు వేస్తే తప్పేంటన్న ఆలోచనతో టీఆర్ఎస్ నేతలు కూడా తనకు ఓటేసి గెలిపించారని రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

బీజేపీలో చేరిన తనను పార్టీ ఆదరించి పోటీచేసే అవకాశం ఇచ్చిందని తెలిపారు. దుబ్బాక విజయం బీజేపీదేనని.. బీజేపీని వేరుగా చూడాల్సిన అవసరం రాదన్నారు. తన నియోజకవర్గానికి రావాల్సింది సామరస్యంగా అడిగి చూస్తానని.. లేదంటే కొట్లాడి సాధిస్తానని రఘునందన్ రావు అన్నారు.

Also Read: తెలంగాణలో సెకండ్‌ వేవ్‌.. ఈటల ఏంటీ మాటలు?

తెలంగాణ ఉద్యమంలో తాను అనేకమందితో కలిసి పనిచేశానని.. గతంలో పోటీచేసి ఓటమి పాలయ్యానని.. ఈసారి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని సానుభూతితో గెలిచానని తెలిపారు. దుబ్బాకలో బీజేపీ గెలుస్తుందని ఎవరూ అంచనావేయలేదని.. మేం నిలబడి విజయం సాధించామని తెలిపారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్