నటీనటులు : సల్మాన్ ఖాన్, దిశా పటాని, రణదీప్ హుడా, జాకీ ష్రాఫ్
దర్శకత్వం : ప్రభుదేవా
నిర్మాతలు : సల్మాన్ ఖాన్, అతుల్ అగ్నిహోత్రి, సోహైల్ ఖాన్, నిఖిల్ నమిత్
సంగీతం : హిమేష్ రేష్మియా, సాజిద్-వాజిద్, సంచిత్ బల్హారా, దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: అయినంక బోస్
ఎడిటింగ్ : రితేష్ సోని
రేటింగ్ : 1.5
ఇండియాలోనే మాస్ హీరోగా ‘సల్మాన్ ఖాన్’కి ఫుల్ ఫాలోయింగ్ ఉంది. మరి ఇలాంటి మాస్ హీరో నుండి మాస్ సినిమా వస్తే ఎలా ఉండాలి ? నిన్న రిలీజ్ అయిన “రాధే” మూవీ కూడా మాస్ మసాలా ఎంటర్ టైనర్ అని సల్మాన్ మొదటి నుండి డప్పు కొడుతూ వస్తున్నాడు. ఆ డప్పులో నిఖార్సయిన సౌండ్ ఉందా లేదా అనేది చూద్దాం.
కథాకమీషు :
మాస్ మసాలా సినిమా అని ముందే చెప్పారు కాబట్టి, మనం కూడా కథ గురించి ఆలోచించక్కర్లేదు. సరే ఫార్ములాటీ కోసమైనా కథ ఏమిటయ్యా అని పరిశీలిస్తే.. హీరోగారు సస్పెండ్ అయిన ఒక సిన్సియర్ పోలీసాఫీసర్. (మొదటి లైన లోనే రొటీన్ కంపు) ఇక డ్రగ్స్ మాఫియా తో నిండిపోయిన ముంబై (అన్ని సినిమాల్లో ముంబై అంటే డ్రగ్స్ అనే చూపించడం, భారతీయ సినిమాకి అనాదిగా వస్తున్న ఆచారం లేండి.)
కాగా ఆ ముంబై సిటీని క్లీన్ చేయాలనే లక్ష్యంతో సస్పెండ్ అయిన ఆ పోలీస్ గారు తిరిగి వెనక్కి వచ్చి అరాచకాలను ఎలా అడ్డుకున్నాడనేది మిగిలిన బాగోతం. అబ్బా గంట కూర్చుంటే పిల్లాడు కూడా ఇంతకన్నా బెటర్ కథ రాయగలడు అని బ్లైండ్ గా స్టేట్ మెంట్ ఇచ్చేసుకోవచ్చు. ఇక సినిమాలో వ్యవహారాలు గురించి వస్తే.. యాక్షన్ మసాలా సినిమా కాబట్టి, రెండు ఫైట్స్ తో నాలుగు సౌండ్ ఎఫెక్ట్స్ తో సన్నివేశాలన్నీ ఊహించినట్టుగానే అలా వచ్చి ఇలా వెళ్లిపోతుంటాయి. అలాగే క్లైమాక్స్ లో కూడా హీరో చేత కాస్త ఎమోషనల్ గా రెండు ముక్కలు చెప్పించి మొత్తానికి శుభం కార్డు వేసేశాడు దర్శకుడు.
ప్లస్ పాయింట్స్ :
సల్మాన్ ఖాన్,
నటీనటుల నటన
మైనస్ పాయింట్స్ :
చెత్త కథ,
వేస్ట్ స్క్రీన్ ప్లే,
రొటీన్ సీన్స్,
బ్యాడ్ డైలాగ్స్,
అలాగే వెరీ బోరింగ్ ఐడియాలజీ,
అంతిమ తీర్పు :
ఈ సినిమా చూడకపోవటం ఉత్తమైన పని. ఎందుకంటే ఈ రాధే సినిమా బాగా నిరాశపరుస్తుంది. సల్మాన్ స్టార్ డమ్ పై నమ్మకంతో సినిమా చూస్తే.. సీన్స్ చూడలేక ”ఇక చాలు భాయ్” అనాల్సి వస్తోంది. కాబట్టి, ఈ పరమ రొటీన్ కంపు యాక్షన్ డ్రామాకు దూరంగా ఉండగలరు అని మా మనవి.