‘ది ఫ్యామిలీ మేన్ 2’ వెబ్ సిరీస్ లో అక్కినేని సమంతకు ఎంత పేరు వచ్చిందో.. మాజీ హీరోయిన్ ప్రియమణికి అంతే పేరు వచ్చింది. ముఖ్యంగా ప్రియమణికి నార్త్ ఇండియాలో ఫుల్ ఫాలోయింగ్ పెరిగింది. తనకు పెరిగిన క్రేజ్ ను చూసి ప్రియమణి కూడా షాక్ అవుతుంది. తనను అందాల నటి అంటుంటే, తనకే కొత్తగా ఉందని.. తన గ్లామర్ పై నార్త్ ఇండియన్స్ చూపిస్తున్న ఆసక్తి చూస్తుంటే.. నేను ఇంకా హీరోయిన్ గా చేయ్యొచ్చు అని తెగ సంతోషపడుతుంది ప్రియమణి.
అయితే, తాజాగా ప్రియమణి ఈ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు ప్రేక్షకులతో పంచుకుంది. కొన్నాళ్ల క్రితం ట్విట్టర్ లో తనని దారుణంగా కామెంట్స్ చేసారని, నెటిజన్లు తనను బ్యాడ్ గా ట్రోల్ చేసేవారని చెప్పుకొని బాధ పడింది. మెయిన్ గా తనను ‘కర్రి దానా’, ‘నల్ల పిల్లి’, ‘ఫ్యాట్ ఆంటీ’ అంటూ హేయమైన కామెంట్స్ చేస్తూ బాగా ఎగతాళి చేశారట.
అప్పటి నుండే ఇక తానూ ట్విట్టర్ కి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని, అందుకే ట్విట్టర్ నుంచి తప్పుకున్నాను అని అసలు విషయం బయటపెట్టింది ప్రియమణి. కానీ నన్ను ఒకప్పుడు ఎగతాళి చేసినవారే, ఇప్పుడు ‘మస్త్’గా ఉన్నావు అంటూ బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారని సంబర పడింది. ప్రస్తుతం ప్రియమణి ఇన్ స్టాగ్రామ్ లో మాత్రమే ఉంది.
ఇక ‘ది ప్యామిలీమెన్ 2’ వెబ్ సిరీస్ పై తమిళనాడులో నిరసనల సెగలు రగలడం కూడా ఈ సిరీస్ కి బాగా ప్లస్ అయింది. దేశవ్యాప్తంగా ఈ సిరీస్ గురించి సామాన్యులకు కూడా తెలిసింది. అసలు తమిళనాడులో ఈ వెబ్ సిరీస్ ను నిషేధించాలంటూ ఇప్పటికే అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది అంటేనే, ఈ వెబ్ సిరీస్ ఎంతగా ప్రభావితం చేసిందో అర్థం చేసుకోవచ్చు.