
ప్రకాశం ఎస్పీ ఏపీలోనే స్టిక్ట్ ఆఫీసర్ గా పేరుపొందారు. ఆయన పోలీసులకు దడపుట్టిస్తున్నాడు. పోలీసులు మర్యాద పాటిస్తున్నారా? ప్రజలకు గౌరవం ఇస్తున్నారా? లేదా అన్నది నిఘా పెట్టి మరీ వారిపై చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా ప్రకాశం నగరంలోని పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏకంగా ట్రైనీ ఎస్పీతో నాటకం ఆడించాడు. సామాన్యుడిలా అతడిని పంపి పోలీసులు ఎలా ప్రవర్తిస్తున్నారో తెలుసుకోమన్నాడు. వాళ్ల దురుసు ప్రవర్తన చూసి షాక్ అయ్యాడు. ఎస్పీకి నివేదిక ఇవ్వడంతో రైటర్ తో సహా సీఐ, ఐదుగురి సిబ్బందిని ప్రకాశం ఎస్పీ సస్పెండ్ చేశారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన వ్యక్తితో దురుసుగా మాట్లాడడం, అవమానించడంపై ఎస్పీ సీరియస్ అయ్యారు. సస్పెండ్ అయిన వారిలో రైటర్ సుధాకర్, సీఐ లక్ష్మణ్, ఎస్ ఐ సాంబశివయ్య, హెడ్ కానిస్టేబుల్ ఏడుకొండలు, కానిస్టేబుల్ ఎం.వి రాజేశ్, మహిళా కానిస్టేబుల్ రమ్యలకు ఫనిష్మెంట్ కింద చార్జి మెమోలు జారీ చేశారు.
తాజాగా ప్రకాశం జిల్లాకు వచ్చిన ట్రైనీ ఐపీఎస్ ను ప్రకాశం జిల్లా ఎస్పీ పోలీస్స్టేషన్ లకు సామాన్యుడిలా వెళ్లి పరీక్షించమని ఆదేశించాడు. జీన్స్ ప్యాంట్, షర్ట్ వేసుకొని అచ్చం కాలేజీ కుర్రాడిలా ట్రైనీ ఎస్పీ పోలీస్ స్టేషన్లోకి ఎంట్రీ ఇచ్చాడు. నేరుగా రైటర్ రూంలోకి వెళ్లాడు. తన మొబైల్ పోయిందని ఫిర్యాదు చేయడానికి వచ్చానని చెబుతాడు. దీంతో వారు ఫిర్యాదు తీసుకున్న తరువాత ఫిర్యాదుకాపీ కావాలని అడుగుతాడు. అయితే వారు రకరకాల ప్రశ్నలు వేసి ఫోన్ ఎలా పోయిందని ఎస్సై, ఇతర కానిస్టేబుళ్లు ట్రైనీ ఎస్పీని తనదైన శైలిలో విచారించారు. అయితే ఫిర్యాదు కాపీ ఇవ్వమని అడిగితే ఇవ్వలేదు. నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ఫోన్ నీదేనని గ్యారెంటీ ఏంది అని దబాయించారు. ఆ ఫోన్ కు సంబంధించిన ఆధారాలు తీసుకోని రా.. అని దురుసుగా పంపించారు.
ఆ ట్రైనీ ఎస్పీ బయటకు రాగానే ఒక ప్రభుత్వ వాహనం వచ్చి ఎదురుగా నిలబడింది. అందులో ఎక్కిన ఆ కుర్రాడిని చూసిన పోలీస్టేషన్ లో వాళ్లంతా షాక్ తిన్నారు. చివరకు అతడో ట్రైనీ ఐపీఎస్ అని.. తనిఖీకి ఎస్పీ పంపించాడని తెలిసి నోరెళ్ల బెట్టారు. ఒంగోలుకు కొత్తగా వచ్చిన ట్రైనీ ఐసీఎస్ జగదీశ్ ఆ కుర్రాడిలా నటించాడు.. ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశల్ జిల్లా పోలీసుల పనితీరుపై ఎప్పటికప్పుడు తనదైన శైలిలో నిఘా ఉంచుతాడు. ఇందులో భాగంగా ట్రైనీ ఐపీఎస్ జగదీశ్ ను ఒంగోలు పోలీస్ స్టేషన్ కు వెళ్లి సామాన్యుడిలా వెళ్లి ఫిర్యాదు ఇవ్వాల్సిందిగా ఆదేశించాడు.
జగదీశ్ పట్ల పోలీసులు దారుణంగా ప్రవర్తించడంతో.. తనకు ఎదురైన అనుభవమంతా ఫుల్ డిటేయిల్స్ తో ఎస్పీకి నివేదిక ఇచ్చాడు జగదీశ్. దీంతో రైటర్ తో సహా సీఐ, ఐదుగురి సిబ్బందిని ఎస్పీ సస్పెండ్ చేశారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన వ్యక్తితో దురుసుగా మాట్లాడడం, అవమానించడంపై ఎస్పీ సీరియస్ అయ్యారు.