https://oktelugu.com/

పోస్టాఫీస్‌ కస్టమర్లకు శుభవార్త.. ఏడాదికి రూ.7 వేలు ఆదా..?

ఇండియా పోస్ట్ పోస్టాఫీస్ కస్టమర్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. సంవత్సరానికి ఏకంగా 7,000 రూపాయలు ఆదా చేసే అవకాశాన్ని పోస్టాఫీస్ కల్పిస్తుండటం గమనార్హం. పోస్టాఫీస్ లో అకౌంట్ ఉన్నవాళ్లకు కేంద్రం పన్ను మినహాయింపు ప్రయోజనాలను అందిస్తోంది. పోస్టాఫీస్‌లో సింగిల్ అకౌంట్ ఉన్నవారు 3,500 రూపాయల వరకు పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. పోస్టాఫీస్ లో జాయింట్ ఖాతా ఉంటే మాత్రం 7,000 రూపాయల వరకు పన్ను మినహాయింపు లభించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : July 12, 2021 10:45 am
    Follow us on

    ఇండియా పోస్ట్ పోస్టాఫీస్ కస్టమర్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. సంవత్సరానికి ఏకంగా 7,000 రూపాయలు ఆదా చేసే అవకాశాన్ని పోస్టాఫీస్ కల్పిస్తుండటం గమనార్హం. పోస్టాఫీస్ లో అకౌంట్ ఉన్నవాళ్లకు కేంద్రం పన్ను మినహాయింపు ప్రయోజనాలను అందిస్తోంది. పోస్టాఫీస్‌లో సింగిల్ అకౌంట్ ఉన్నవారు 3,500 రూపాయల వరకు పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందే అవకాశం అయితే ఉంటుంది.

    పోస్టాఫీస్ లో జాయింట్ ఖాతా ఉంటే మాత్రం 7,000 రూపాయల వరకు పన్ను మినహాయింపు లభించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతాలపై 4 శాతం వడ్డీ లభిస్తుంది. దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవింగ్స్ ఖాతాలపై కేవలం 2.7 శాతం వడ్డీ ఇస్తుంది. ఎస్బీఐతో పోలిస్తే పోస్టాఫీస్ లలో ఖాతాలపై ఎక్కువ వడ్డీ లభిస్తుండటం గమనార్హం.

    అందువల్ల కస్టమర్లు  ఎస్బీఐతో పోలిస్తే పోస్టాఫీస్ లో అకౌంట్ ఓపెన్ చేస్తేనే మంచిదని చెప్పవచ్చు. కేవలం 500 రూపాయలతో పోస్టాఫీస్ లో సులభంగా ఖాతా ఓపెన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. పోస్టాఫీస్ ఖాతాలో కనీసం 500 రూపాయల బ్యాలెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ ఈ బ్యాలెన్స్ ఖాతాలో లేకపోతే మాత్రం ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది.

    పోస్టాఫీస్ కస్టమర్లకు ఖాతాను ఉపయోగించడం ద్వారా ఇతర పోస్టాఫీస్ పథకాలను కూడా ఎంచుకునే అవకాశం అయితే ఉంటుంది. కొన్ని పోస్టాఫీస్ స్కీమ్స్ ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ రాబడి పొందే అవకాశం ఉంటుంది.