రామతీర్థం మళ్లీ అట్టుడికింది. ఆంధ్రప్రదేశ్ లో విగ్రహాల విధ్వంసంపై బీజేపీ పోరుబాట కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా రామతీర్థంలోని శ్రీరాముడిని దర్శించుకునే వరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే ఈనెల 5న పోలీసులు చలో రామతీర్థాన్ని భగ్నం చేశారు. ఈ నేపథ్యంలో రామతీర్థం వెళ్లి తీరుతామని బీజేపీ నేతలు ఈరోజు ‘చలో రామతీర్థం’ను మరోసారి పిలుపునిచ్చారు.
Also Read: జగన్ ఇమేజీని పెంచేసిన పవన్ కల్యాణ్
మూడురోజులుగా విశాఖపట్నంలోనే మకాం వేసిన బీజేపీ నేతలు తాజాగా ఈరోజు విశాఖ నుంచి రామతీర్థం బయలు దేరారు. విశాఖ నుంచి విజయవాడ వెల్లే దారిలో భారీగా మోహరించిన పోలీసులు ఈ బీజేపీ నేతలను అడ్డుకున్నారు. పోలీసుల వలయాలను దాటుకుంటూ నెలిమర్ల జంక్షన్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేరుకున్నారు. ఎంపీ జీవీఎల్ నరసింహరావు, జాతీయ కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలను పోలీసులు అడ్డుకున్నారు.
ఈ క్రమంలోనే పోలీసులు, బీజేపీ నేతలకు మధ్య వాగ్వాదం.. తోపులాట.. గొడవ జరిగింది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తోపులాటలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు , విష్ణువర్ధన్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో కార్యకర్తలు వారిద్దరికీ మంచినీళ్లు అందించి సేవలు చేశారు.
Also Read: ఆ ఆలయాలను పునర్నిర్మిస్తాం: జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఇక రామతీర్థం రాముడిని దర్శించుకునే వారకు కదలమని బీజేపీ నేతలు భీష్మించుకు కూర్చున్నారు. చంద్రబాబు, విజయసాయిరెడ్డిని అనుమతించి తమనకు ఎందుకు అడ్డుకుంటున్నారని సోము వీర్రాజు పోలీసులపై మండిపడ్డారు. సీఎం జగన్ కు వార్నింగ్ ఇచ్చారు. ఈ పోరాటం ఇక్కడితో ఆగదని.. వెనకడుగు వేసే ప్రసక్తే లేదని సోము వీర్రాజు స్పష్టం చేశారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్