పెన్షన్ తీసుకునే వారికి అలర్ట్.. ఈ తప్పు చేస్తే పెన్షన్ కట్..!

దేశంలో పెన్షన్ తీసుకునే వాళ్లు కోట్ల సంఖ్యలో ఉన్నారు. అయితే పెన్షన్ తీసుకునేవాళ్లు ఎటువంటి ఇబ్బంది లేకుండా పెన్షన్ తీసుకోవాలంటే ప్రతి సంవత్సరం లైఫ్ సర్టిఫికెట్ ను బ్యాంక్ లేదా పోస్టాఫీస్ లో ఇవ్వాలి. ఎవరైతే లైఫ్ సర్టిఫికెట్ ను ఇవ్వరో వాళ్లు మళ్లీ లైఫ్ సర్టిఫికెట్ ను సబ్మిట్ చేసే వరకు పెన్షన్ ను పొందలేరు. ప్రతి సంవత్సరం బ్యాంకులు, పోస్టాఫీసులు ఈ సర్టిఫికెట్ ను సబ్మిట్ చేయాలని కోరతాయి. మరిన్ని జాతీయ రాజకీయ వార్తల […]

Written By: Kusuma Aggunna, Updated On : November 4, 2020 8:16 pm
Follow us on


దేశంలో పెన్షన్ తీసుకునే వాళ్లు కోట్ల సంఖ్యలో ఉన్నారు. అయితే పెన్షన్ తీసుకునేవాళ్లు ఎటువంటి ఇబ్బంది లేకుండా పెన్షన్ తీసుకోవాలంటే ప్రతి సంవత్సరం లైఫ్ సర్టిఫికెట్ ను బ్యాంక్ లేదా పోస్టాఫీస్ లో ఇవ్వాలి. ఎవరైతే లైఫ్ సర్టిఫికెట్ ను ఇవ్వరో వాళ్లు మళ్లీ లైఫ్ సర్టిఫికెట్ ను సబ్మిట్ చేసే వరకు పెన్షన్ ను పొందలేరు. ప్రతి సంవత్సరం బ్యాంకులు, పోస్టాఫీసులు ఈ సర్టిఫికెట్ ను సబ్మిట్ చేయాలని కోరతాయి.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

అయితే చాలామంది ఈ లైఫ్ సర్టిఫికెట్లను అందజేసే విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలకు చెక్ పెట్టడానికి ఈపీఎఫ్వో కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ లో పెన్షన్ సర్టిఫికెట్లను అందజేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ నెల 1వ తేదీ నుంచి 2020 డిసెంబర్ 31వ తేదీ వరకు ఎక్కడికి వెళ్లకుండానే సులభంగా ఆన్ లైన్ లో లైఫ్ సర్టిఫికెట్లను సబ్మిట్ చేసే అవకాశాన్ని ఈపీఎఫ్వో కల్పిస్తోంది.

Also Read: ఠాక్రే ప్రతీకారం: అర్నబ్‌ గోస్వామి అరెస్ట్‌

ఈపీఎఫ్వో ట్విట్టర్ ద్వారా ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. ఎవరైతే ఉద్యోగం నుంచి పదవీ విరమణ పొందుతారో వాళ్లు ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి లైఫ్ సర్టిఫికెట్ ను ఇవ్వాల్సిందేనని లైఫ్ సర్టిఫికెట్ ను ఇవ్వని వాళ్లు పెన్షన్ పొందడానికి అర్హులు కారని తెలిపింది. లైఫ్ సర్టిఫికెట్ సహాయంతో బ్యాంకులు, పోస్టాఫీసులు పెన్షన్ తీసుకునే వ్యక్తి జీవించి ఉన్నాడో లేదో తెలుసుకోవాల్సి ఉంటుంది.

Also Read: బీహార్‌‌ ఎన్నికలు: మోడీ వరాలు.. అక్కడి ప్రజలు నమ్మేనా..!

దేశంలో సంవత్సరానికి 60 లక్షలకు పైగా పెన్షనర్లు ప్రతి సంవత్సరం పెన్షన్ పొందుతున్నారు. కామన్ సర్వీస్ సెంటర్ లేదా ఉమాంగ్ యాప్ లేదా బ్యాంక్ వెబ్ సైట్ ద్వారా కూడా లైఫ్ సర్టిఫికెట్లను సమర్పించే అవకాశం ఉంటుంది.