జగన్ సర్కార్ కు మళ్లీ షాకిచ్చిన నిమ్మగడ్డ

రాజ్యాంగబద్దమైన పదవిలో ఉంటూ ఏపీ సర్కార్ ను చెడుగుడు ఆడేస్తున్నాడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ.. ఏపీ పంచాయితీ ఎన్నికలను పట్టుబట్టి మరీ నిర్వహిస్తున్నాడు. జగన్ సర్కార్ కాదన్న కూడా సుప్రీంకోర్టుకు వెళ్లి మరీ అనుమతి తెచ్చుకొని జగన్ సర్కార్ ను ఓడించాడు. Also Read: తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు.. వైఎస్ షర్మిల క్లారిటీ ఇప్పుడు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ తో ఏపీలో నిమ్మగడ్డ జోరు పెంచాడు. పంచాయితీ ఎన్నికలకు రెడీ అయ్యాడు. బదిలీలను చేపట్టాడు. […]

Written By: NARESH, Updated On : January 26, 2021 10:25 am
Follow us on

రాజ్యాంగబద్దమైన పదవిలో ఉంటూ ఏపీ సర్కార్ ను చెడుగుడు ఆడేస్తున్నాడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ.. ఏపీ పంచాయితీ ఎన్నికలను పట్టుబట్టి మరీ నిర్వహిస్తున్నాడు. జగన్ సర్కార్ కాదన్న కూడా సుప్రీంకోర్టుకు వెళ్లి మరీ అనుమతి తెచ్చుకొని జగన్ సర్కార్ ను ఓడించాడు.

Also Read: తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు.. వైఎస్ షర్మిల క్లారిటీ

ఇప్పుడు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ తో ఏపీలో నిమ్మగడ్డ జోరు పెంచాడు. పంచాయితీ ఎన్నికలకు రెడీ అయ్యాడు. బదిలీలను చేపట్టాడు. ఏపీలో ఉన్నతాధికారుల బదిలీల కోసం ప్రతిపాదనలను కోరగా.. జగన్ సర్కార్ చేసిన ప్రతిపాదనలను నిమ్మగడ్డ రమేశ్ తిరస్కరించి మరో షాక్ ఇచ్చాడు.

పంచాయితీరాజ్ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయితీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ బదిలీ ప్రతిపాదనలను ఎస్ఈసీ తిరస్కరించడం సంచలనమైంది. ఎన్నికల ప్రక్రియ కీలక దశలో ఉన్నప్పుడు బదిలీలు తగవని స్పష్టం చేశారు. బదిలీ చేయాలని భావిస్తే ఎన్నికల విధి విధానాలు పాటించాలని సూచించారు.

Also Read: కాపులకు కాపులే శత్రువు.. కాపు సేన ఏర్పాటు కథేంటి?

ఇప్పుడున్న వారిని బదిలీ చేసి కొత్త వారిని నియమిస్తే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందని.. అందుకే ఇద్దరు పంచాయితీరాజ్ అధికారుల బదిలీ సరైంది కాదని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ఓ ప్రకటన జారీ చేశారు.

నిన్న పంచాయితీరాజ్ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయితీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ లను ఏపీ ప్రభుత్వం బదిలీ చేసేసింది. అయితే ఈ బదిలీ ప్రతిపాదలను తిరస్కరిస్తున్నట్టు నిమ్మగడ్డ తాజాగా ప్రకటన జారీ చేయడం చర్చనీయాంశమైంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్