నూతన సంవత్సర వేడుకలపై తెలంగాణ సర్కార్ పలు ఆంక్షలు విధించింది. ఇప్పటికే ఇందుకు సంబంధించి ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసింది. పోలీస్ యాంత్రాంగమంతా న్యూ ఇయర్ వేడుకలపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. కరోనా కొత్త స్ట్రెయిన్ ఎఫెక్ట్ కారణంగా ప్రజలంతా న్యూ ఇయర్ వేడుకలు ఇంట్లో జరుకోవాలని కోరుతోంది.
Also Read: రైతంటే భూమి ఉన్నోడా.. పంట పండించేటోడా?
అయితే మందుబాబుల కోసం మాత్రం ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. డిసెంబర్ 31న అర్ధరాత్రి వరకు మద్యం షాపులు.. ఒంటిగంట వరకు బార్లు.. క్లబ్బులకు అనుమతి ఇచ్చింది. అయితే ఇదే సమయంలో తాగివాహనం నడిపే వాహనదారులకు చుక్కలు చూపించేందుకు ట్రాఫిక్ పోలీసులు రెడీ ఉన్నారు.
నగరంలో డ్రెంకన్ డ్రైవ్ టెస్టులు చేపడుతున్నారు. డ్రెంకన్ డ్రైవ్ టెస్టులో పట్టుబడితే పదేళ్ల వరకు జైలు శిక్ష పడేలా చేయనున్నట్లు సీపీ సజ్జనార్ ఇటీవల మందుబాబులకు హెచ్చరికలు జారీ చేశారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగరంలో బేగంపేట ఫ్లై ఓవర్ మినహా మిగతా ఫ్లై ఓవర్లను మూసివేస్తున్నట్లు పోలీసులు తాజాగా ప్రకటించారు.
నేటి రాత్రి 10 గంటల నుంచి జనవరి 1 ఉదయం 5గంటల వరకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఈ సందర్భంగా నగరంలోని సైబర్ టవర్స్.. గచ్చిబౌలి.. బయోడైవర్సిటీ ప్లై ఓవర్.. జేఎన్‌టీయూ.. మైండ్‌స్పేస్.. దుర్గం చెరువు తీగల వంతెనలను మూసివేయనున్నారు.
Also Read: రైతు చట్టాలు.. ఆయుష్మాన్ భారత్.. మోడీకి కేసీఆర్ సాగిలపడ్డాడా?
పీవీ ఎక్స్‌ప్రెస్ హైవే.. ఔటర్ రింగ్ రోడ్డుపైకి కార్లను అనుమతించరు. ప్రతీయేటా నూతన సంవత్సర వేడుకలు జరిగే నెక్లెస్ రోడ్డు.. ఎన్టీఆర్ మార్గ్‌తోపాటు.. బీఆర్‌కే భవన్.. తెలుగు తల్లి కూడలి.. లిబర్టీ జంక్షన్.. నల్లగుట్ట రైల్వే వంతెన వద్ద వాహనాలను దారి మళ్లించే ఏర్పాట్లను పోలీసులు చేస్తున్నారు.
నేటి రాత్రి 11 గంటల ఉదయం 2గంటల వరకు నగరంలోకి భారీ వాహనాలను అనుమతి ఉండదు. ఉదయం 5గంటల వరకు కూడా ఔటర్ రింగ్ రోడ్డుపై తేలికపాటి వాహనాలకు కూడా అనుమతి లేదని తెలుస్తోంది. అయితే ఎయిర్‌పోర్టుకు వెళ్లే వాహనాలకు మినహాయింపు ఉండనుంది. పీవీ ఎక్స్‌ప్రెస్ వేకు సైతం ఇవే నిబంధనలు వర్తిస్తాయని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్