కొత్త ట్రాఫిక్ రూల్స్.. బండి ఉంటేనే ప్రమాదం.. అమ్మేస్తే పోలా..!

బండి ఉంది కదా అని రయ్.. రయ్ మని తిరిగితే ఇక అంతే సంగతి.. మీ జేబులకు చిల్లు పెట్టేందుకు ట్రాఫిక్ పోలీసోడు రెడీ గా ఉన్నాడు. బండి రోడ్డు మీదకు వచ్చిందా? ఇక రాసుడే(చలాన్లు) కార్యక్రమం షూరు అయినట్టే..! Also Read: ‘దివీస్’పై సడెన్ గా జగన్ కు ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చింది? ఇప్పటికే పెరిగిన పెట్రోల్ రేట్లతో వాహనదారుడు ఇబ్బందులు పడుతుంటే దీనికితోడు ఏపీ సర్కార్ కొత్త ట్రాఫిక్ రూల్స్ పేరుతో న్యూ ఇయర్ […]

Written By: Neelambaram, Updated On : December 27, 2020 4:51 pm
Follow us on


బండి ఉంది కదా అని రయ్.. రయ్ మని తిరిగితే ఇక అంతే సంగతి.. మీ జేబులకు చిల్లు పెట్టేందుకు ట్రాఫిక్ పోలీసోడు రెడీ గా ఉన్నాడు. బండి రోడ్డు మీదకు వచ్చిందా? ఇక రాసుడే(చలాన్లు) కార్యక్రమం షూరు అయినట్టే..!

Also Read: ‘దివీస్’పై సడెన్ గా జగన్ కు ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చింది?

ఇప్పటికే పెరిగిన పెట్రోల్ రేట్లతో వాహనదారుడు ఇబ్బందులు పడుతుంటే దీనికితోడు ఏపీ సర్కార్ కొత్త ట్రాఫిక్ రూల్స్ పేరుతో న్యూ ఇయర్ నుంచి బాదుడు కార్యక్రమాన్ని షూరు చేయనుంది.

వాహనదారుల ప్రమాదాల నివారణ కోసమే కొత్త ఏడాది నుంచి కొత్త ట్రాఫిక్స్ రూల్స్ అమలు చేయబోతున్నామంటూ జగన్ సర్కార్ చెబుతోంది. కొత్త ట్రాఫిక్ రూల్స్ కు సంబంధించిన ఉత్తర్వులను తాజాగా జారీ చేసింది.

ఈ కొత్త ట్రాఫిక్స్ రూల్స్ చూస్తే మధ్యతరగతి జీవి జీతమంతా చలాన్లకే సరిపోయేలా ఉంది. గత అక్టోబర్లో ట్రాఫిక్‌ రూల్స్‌కు సంబంధించిన ఇచ్చిన జీవోలో కొన్ని మార్పులుచేసి జనవరి 1నుంచి కొత్త జీవో అమలు చేయబోతుంది.

Also Read: వైసీపీ, బీజేపీ ‘ఫ్లెక్సీల’ వార్..

కొత్త ట్రాఫిక్ రూల్స్ ప్రకారంగా.. మైనర్లు డ్రైవింగ్ చేస్తే 5వేలు.. అతివేగంతో బండి న‌డిపితే వెయ్యి.. ఫైన్ విధించినా ట్రాఫిక్ రూల్స్ పాటించ‌క‌పోతే డ్రైవింగ్ లైసెన్స్ ర‌ద్దు.. పోలీసులు వాహ‌నాల్ని త‌నిఖీ చేసే స‌మ‌యంలో ఇబ్బంది పెడితే రూ.750 ఫైన్ విధిస్తారు.

డ్రైవింగ్‌ లైసెన్స్‌కు అర్హతలేనివారు బండి నిడిపితే 10వేలు.. ప‌ర్మిట్ లేక‌పోతే 10వేలు.. డ్రైవ్ చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడితే 10వేలు.. రేసింగ్ లో పాల్గొంటే 5-10వేలు.. పాఠశాలలు.. ఆలయాల వద్ద హారన్ కొడితే రూ.వెయ్యి.. రెండోసారి అలా చేస్తే రెండు వేలు ఫైన్లను కొత్త జీవో ప్రకారం కట్టాల్సిందే.

బండి బయటికి తీస్తే వాహనదారుడికి ప్రమాదం సంగతి పక్కన పెడితే.. చలాన్లు ప్రమాదం మాత్రం పొంచి ఉందనే టాక్ విన్పిస్తోంది. ఈ ఫైన్లు చూశాక వాహనదారుడు అత్యవసరమైతే తప్ప బయటికి తీయకపోవచ్చనే కామెంట్స్ విన్పిస్తోంది. మరికొందరేమో బండి  ఉంటేనేగా ప్రమాదం అమ్మేస్తే పోలా.. అంటున్నారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్