నయనతార సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి చాలా సినిమాల్లో నటించింది. ఇటీవలే రజినీకాంత్ ‘దర్బార్’లోనూ నయన్ నటించి మెప్పింది. ఈ మూవీ కోసం నయనతార ఏకంగా 5.5 కోట్లు తీసుకుందని సమాచారం. దీనికితోడు ఆమెతో ఉన్నవారికి మెయింటెన్స్ ఖర్చులు తప్పని సరి చూసుకోవాల్సిందే. రజనీకాంత్ తాజాగా శివ దర్శకత్వంలో ‘అన్నాతై’ మూవీలో నటిస్తున్నాడు. రజినీకి జోడీగా నటించేందుకు నయన్ సంప్రదించగా గ్రీన్ సిగ్నిల్ ఇవ్వడంతోపాటు నిర్మాతలకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది.
ఈ మూవీని సన్ పిచర్స్ నిర్మిస్తుంది. వరుసగా రజినీతో రెండోసారి కావడంతో నిర్మాత అడగకముందే కోటి రూపాయాలు తగ్గించి ఇవ్వండని చెప్పిందట. దీంతో నిర్మాతలు ఆనందంతో వెంటనే అగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే నయనతార సినిమా ప్రమోషన్లకు మాత్రం దూరంగా ఉంటుంది. ఇటీవల నయనతారపై నిర్మాతలు ఈ విషయంలో గుర్రుగా ఉంటున్న సంగతి తెల్సిందే. అయితే నయనతార కోటి రూపాయాలు తగ్గించడం వెనుక కారణం ప్రమోషన్లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడమేనా అనే సందేహం కలుగుతుంది. ఏదిఏమైనా నయన్ చేసిన పనికి నిర్మాతలు మాత్రం హ్యపీగా ఫీలవుతున్నారట.